దేవయాని ఇష్యూపై నామా, అవిశ్వాసంపై కాంగ్ నోటీసు

ఇక సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం పైన నోటీసును ఇచ్చారు. కాగా, బుధవారం ఉదయం లోకసభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి మీరా కుమార్ సభను పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో చైర్మన్ పదిహేను నిమిషాలు వాయిదా వేశారు.
లోకసభ తిరిగి పన్నెండు గంటలకు ప్రారంభమైంది. తనకు అవిశ్వాసంపై నోటీసులు అందినట్లు సభాపతి మీరా కుమార్ ప్రకటించారు. అయితే సభ్యులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తుండటంతో... సభ సజావుగా సాగనిస్తే తాను నోటీసులను పరిగణలోకి తీసుకుంటానని చెప్పారు.
మరోవైపు రాజ్యసభలో దేవయాని ఇష్యూ చర్చకు వచ్చింది. దేవయాని పట్ల అమెరికా తీరు బాధాకరమని, గతంలో కూడా అగ్రదేశం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఈ ఘటనపై భారత్ సరైన చర్యలు తీసుకోవాలని అరుణ్ జైట్లీ అన్నారు.
నిరాశ వద్దు: సోనియా
మరోవైపు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందవద్దని, ఓటమికి గల కారణాలను సమీక్షించుకొని ముందుకు వెళ్దామని పార్టీ నేతలకు ఢిల్లీలో జరిగిన కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సూచించారు. మహిళా బిల్లును ఇప్పటి వరకు ఆమోదింపచేసుకోలేకపోయామని, ఇది చాలా వెలితిగా ఉందన్నారు. పార్టీలోని నాయకుల మధ్య సఖ్యత కొరవడిందన్నారు. అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.












Click it and Unblock the Notifications