జాబితాలో పేరు లేదంటూ ఆదిత్య థాక్రేను అనుమతించని పీఎం సెక్యూరిటీ: చివరకలా
ముంబై: మహారాష్ట్ర ఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కారులో నుంచి దిగాల్సిందిగా రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేను ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా సిబ్బంది కోరారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముంబైలో ప్రధాని మోడీని రిసీవ్ చేసుకోవడానికి షెడ్యూల్ చేయబడిన వీఐపీల జాబితాలో ఆదిత్య థాక్రే పేరు లేదని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) పేర్కొంది.
చివరికి, సీఎం ఉద్ధవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆదిత్య థాకరేను పీఎం మోడీకి స్వాగతం పలికేందుకు అనుమతించారు. కాగా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)కి వెళ్ళి, అక్కడ వారు కలిసి రెండవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒకే వేదికపై సీఎం ఉద్ధవ్, పీఎం మోడీ
నెలల తరబడి సాగిన వివాదాల తర్వాత.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ముంబైలో రెండు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కోలాబాలోని నౌకాదళ హెలిపోర్ట్ ఐఎన్ఎస్ షిక్రా వద్ద ముఖ్యమంత్రి ప్రధానికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి, ప్రధాని కలిసి వేదిక పంచుకున్న తొలి కార్యక్రమానికి వెళ్లారు.
రాజ్ భవన్‌లో జల్ భూషణ్ భవనం, విప్లవకారుల గ్యాలరీని ప్రధాని ప్రారంభించారు. "ప్రధాని మోడీ విప్లవకారుల గ్యాలరీని ప్రారంభించడం ఒక శుభ సందర్భం, ఇది చాలా గొప్ప విషయం. మన స్వాతంత్ర్య పోరాట కథలను సజీవంగా ఉంచడం మన కర్తవ్యం, ఆ సమయంలో ఏమి జరిగిందో మన రాబోయే తరాలకు చెప్పడంలో ఇది కీలకం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి గురించిన సమాచారంతో కూడిన యాత్రాస్థలం ఈ గ్యాలరీ' అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)కి వెళ్లనున్నారు, అక్కడ వారు కలిసి రెండవ కార్యక్రమంలో పాల్గొంటారు. వీఐపీల కదలికలతో నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ముంబై పోలీసులు ట్రాఫిక్ సలహాలు ఇచ్చారు. ప్రధానమంత్రి శివారులోని వ్యాపార జిల్లా అయిన బీకేసీలో జరిగిన కార్యక్రమం తర్వాత న్యూఢిల్లీకి బయలుదేరతారు.












Click it and Unblock the Notifications