మరో సంచలనం: రూ.99కే నమోటెల్ స్మార్ట్‌ఫోన్

బెంగళూరు: ఇటీవల రూ.251కే స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తామంటూ రింగింగ్‌ బెల్స్‌ అనే సంస్థ ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు ఏకంగా రూ.99కే స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తామని నమోటెల్‌ అచ్చే దిన్‌ సంస్థ ప్రకటించి మరో సంచలనానికి తెరతీసింది.

ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత చవకైన స్మార్ట్‌ ఫోన్‌ అని సంస్థ సంస్థ ప్రమోటర్‌ మాధవ్‌ రెడ్డి వెల్లడించారు. ఈ విషయమై బెంగళూరులో మాట్లాడుతూ.. మే 17 నుంచి 25 మధ్యఈ ఫోన్‌ బుకింగ్‌కి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఫోన్‌ ఫీచర్ల వివరాల్ని కూడా ఆయన వెల్లడించారు.

నమోటెల్‌.కామ్‌ సంస్థ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ని పొందుపరిచారు. దాని అసలు ధర రూ.2,999గా ఉండగా దాన్ని రూ.99కి తగ్గించినట్లుగా ఉంది. క్యాష్‌ ఆన్‌ డెలివరీతో దీన్ని కొనుగోలుదారులకు సరఫరా చేస్తామని సంస్థ తెలిపింది.

Namotel Acche Din priced at just Rs 99; world’s cheapest smartphone, promoter claims

అందుకు నామమాత్రపు డెలివరీ రుసుము వసూలు చేస్తామని చెప్పింది. మేకిన్‌ ఇండియా ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌ని తయారు చేశామని పేర్కొంది. ఆధార్‌ కార్డు ఉన్న భారతీయులకు మాత్రమే ఈ ఫోన్‌ని అమ్ముతామని స్పష్టం చేసింది.

టాప్10 ఫీచర్లు వివరాలు ఇవే:

- 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
- 1జీబీ ర్యామ్, 4జీబీ రోమ్
- 3జీ స్మార్ట్ ఫోన్
- 2ఎంపీ రేర్, .3ఎంపీ ఫ్రంట్ కమెరా
- డ్యూయెల్ సిమ్
- 4 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే
- 1325 ఎంఏహెచ్‌ బ్యాటరీ
- ప్లాస్టిక్ హౌజింగ్
- తెలుపు, నలుపు రంగుల్లో ఫోన్‌ లభ్యం
- ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+