అందుకే: ప్రపంచంలోనే తొలి జర్నలిస్ట్ నారదుడు
న్యూఢిల్లీ: ప్రపంచంలో మొట్టమొదటి జర్నలిస్ట్ ఎవరు? అంటే పురాణ పురుషుడైన నారద ముని అంటున్నారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) నాయకులు. నారద ముని జయంతిని దేశవ్యాప్తంగా జరిపారు. ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలోని జర్నలిస్ట్‌లు గత కొన్నేళ్లుగా నారదుని జయంతిని జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఈసారి కూడా జరిపారు.
ఫరీదాబాద్‌లోని సిటీ ప్రెస్ క్లబ్‌లో విశ్వ సంవద్ కేంద్ర సహకారంతో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నారద ముని తొలి విలేకరి అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జర్నలిస్టులు ఆ వృత్తిలో నారద ముని యొక్క ఫాలోవర్స్ అని చెప్పారు.

నారదుడు అంతటా తిరిగి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు పరితపించేవాడని చెప్పారు. దేవుళ్లైనా, రాక్షసులు అయినా... న్యాయం వైపు నిలబడేవాడన్నారు. సినిమాల్లో.. నారదుడు ఒకరి పైన ఒకరికి చాడీలు చెప్పినట్లుగా ఉంటుందని, నారదుడు చేసింది అసలు అది కాదన్నారు. లోక కళ్యాణం కోసం ఆయన చూసేవాడన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పత్రికలైన ఆర్గనైజర్‌లో... నేటి జర్నలిస్టులకు ఆరెస్సెస్ సూచనలు చేసింది. ప్రస్తుత జర్నలిస్టులు నారదుడిని ఆదర్శంగా తీసుకొని పని చేయాలని సూచించారు. ఆరెస్సెస్ నేత జే నందకుమార్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే నారదుడు తొలి జర్నలిస్ట్ అని చెప్పారు. అతనికి ప్రతి అంశం క్షుణ్ణంగా తెలుసునని చెప్పారు. అతను దుర్యోధనుడికి పాలనలో సూచనలు చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications