తగ్గని ప్రజాదరణ: సర్వేలో మళ్లీ ప్రధానిగా మోడీయే

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రాభవం తగ్గడం లేదు. ప్రజాధరణలో గాంధీల కుటుంబాన్ని మోడీ వెనక్కి నెట్టేశారు. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీయే బెట్టర్ అని తాజాగా, చేసిన సర్వేలో తేలింది. మోడీకే ఓటేస్తామని ఎక్కువ మంది చెప్పారు.

పంతొమ్మిది రాష్ట్రాలలోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇండియా టుడే ఓ సర్వే తేలింగి, ఓటర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన నేత ఎవరనే విషయమై 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరిట కార్వీ ఇన్ సైట్స్ భాగస్వామ్యంతో ఈ సర్వే నిర్వహించారు.

ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఎన్డీయేకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని తేలింది. మోడీకి అనుకూలంగా 50 శాతం మంది ప్రజలు తమ మద్దతు తెలిపారు. మోజీకో పోలిస్తే రాహుల్ గాంధీకి 13 శాతం తక్కువగా మద్దతు లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు.

Narendra Modi best suited to be India's next prime minister if elections held now: Survey

ఎన్డీయే సర్కార్ పైన వస్తున్న ఆరోపణలు, వ్యతిరేకత వంటి అంశాలు ఎటువంటి ప్రభావం చూపలేకపోయానని ఈ సర్వే పేర్కొంది. లోకసభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 304 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎన్డీయేకు చెందిన నాయకులే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ సర్వే పేర్కొంది.

బెస్ట్ పీఎం ఎవరనే విషయమై ఆయా రాష్ట్రాల ఓటర్లను ప్రశ్నించగా... మొదటి స్థానంలో ఇందిరాగాంధీ, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా వాజపేయి, నరేంద్ర మోడీలు నిలిచారు. ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+