భార్యనే పట్టించుకోలేదు, ఎందుకొదిలేశావ్?: మోడీపై డిగ్గీ
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. మహిళా దినోత్సవం రోజున మోడీపై దిగ్విజయ్ వ్యక్తిగత దాడి చేస్తూ... భార్యను ఏమాత్రం గౌరవించని, ఆమె బాగోగులు చూడని మోడీ దేశం గురించి ఏం పట్టించుకుంటారంటూ ధ్వజమెత్తారు.
మహిళల పట్ల తన హృదయంలో ఏమాత్రం గౌరవం ఉన్నా ఎన్నికల ఫారమ్‌లో తన భార్య పేరు రాయాల్సిన కాలమ్‌ను ఖాళీగా ఎందుకు వదిలి పెట్టారని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. మోడీ తన భార్య పేరును ఎందు ప్రస్తావించలేదన్నరు. పాపం యశోదా బెన్ (ఒకప్పటి మోడీ భార్య) అద్దె ఇంట్లో ఉంటున్నారని, అతను ఇంత గొప్ప మనిషైన తర్వాత మోడీ ఆమెకు ఒక బంగళా, ఇతర సదుపాయాలు ఎందుకు కల్పించలేదన్నారు.

తన భార్యను గౌరవించలేని, ఆమె బాగోగులు చూడలేని వ్యక్తి దేశం బాగోగుల గురించి ఏమి పట్టించుకుంటారన్నారు. అసలు పెళ్లి చేసుకోలేదా లేక ఆమెను వదిలేశారా మోడీ ఎందుకు చెప్పడం లేదన్నారు.
మహాత్మాగాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమని ఆరోపించిన రాహుల్ గాంధీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న ఆర్‌ఎస్‌ఎస్ హెచ్చరికను సైతం దిగ్విజయ్ కొట్టి పారేసారు. రాహుల్ గాంధీ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమని, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ల సిద్ధాంతమే మహాత్మా గాంధీని హత్య చేసిందని, వారి సిద్ధాంతం కారణంగానే గాంధీ హత్య చేయబడ్డారని తాము నిరూపిస్తామని, వాళ్ల రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రచారం కారణంగానే గాంధీ చంపబడ్డారన్నారు. తాము ఈ సిద్ధాంతంపై పోరాటం చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా పోరాడుతామని దిగ్విజయ్ అన్నారు.












Click it and Unblock the Notifications