వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ నోట 'టీమిండియా', బేలూర్ మఠంలో గురువుని కలిశారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: ప్రధాని నరేంద్రమోడీ పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా ఆదివారం బరన్‌పూర్‌లో ఆధునీకరించిన ఐఐఎస్‌సీవో ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'టీమిండియా' కృషి వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే ఈ ప్లాంట్ ఏర్పాటయ్యేదే కాదని అన్నారు. అందుకే తాను 'టీమిండియా' ప్రాధాన్యతను పదేపదే ప్రస్తావిస్తుంటానని చెప్పారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, టీమ్ ఇండియా స్పూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు.

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఏకమైతేనే దేశం అభివృద్ధి దిశగా సాగుతుందని అన్నారు. పార్టీల మధ్య రాజకీయ విభేదాలున్నా, ఆ ప్రభావం అభివృద్ధిపై పడకూడదని ప్రధాని మోడీ సూచించారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు సమస్యను పరిష్కరించుకున్నామని అన్నారు.

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

ఈశాన్య భారతాన్ని శక్తిమంతం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా ముందుగా పశ్చిమ బెంగాల్‌ను బలోపేతం చేయాలని అన్నారు. భారత ఈశాన్య ప్రాంతంలో అమేయ శక్తి ఉందని, ఇక్కడి ప్రజలు నైపుణ్యం ఉన్నవాళ్లని కొనియాడారు.

 ‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

తమ ప్రభుత్వ హయాంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని స్పష్టం చేశారు. బొగ్గు గనులు కేటాయించిన ప్రతి జిల్లాలో ఒక సంస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు.

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంతమేర స్థానికుల కోసం వినియోగిస్తామని చెప్పారు.

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

అనంతరం ప్రధాని మోడీ బేలూర్ మఠానికి చేరుకుని సందర్శించారు. రామకృష్ణ పరమహంస ఆత్మజ్ఞానం పొందిన ఆలయంలో కొద్దిసేపు గడిపారు.

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

బేలూరులోని రామకృష్ణ మఠానికి పెద్దగా ఉన్న 97 ఏళ్ల ఆత్మస్థానంద్ మహారాజ్ గత కొద్దికాలంగా ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్న ఆయన్ని ప్రధాని మోడీ ఆదివారం కలిశారు.

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

ప్రధాని మోడీ తన గురువు గారిని చివరిసారిగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలుసుకున్నారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించి మోడీ ప్రధాని అయ్యాక తమ ఆశ్రమానికి రావాల్సిందిగా బేలూర్ మఠం నుంచి మోడీకి లేఖ రాశారు

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

అంతక ముందు కోల్‌కత్తాలోని దక్షిణేశ్వర్‌ కాళికామాత ఆలయాన్ని ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు.

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

‘అభివృద్ధికి రాజకీయ విభేదాలు ఆటంకం కారాదు'

ఆలయ సిబ్బంది, పూజారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. కాళికా మాతాను దర్శించుకున్న అనంతరం తీర్త ప్రసాధాలు అందజేసి మోడీని సన్మానించారు.

English summary
Prime Minister Narendra Modi today offered prayers at the famed Dakshineswar temple near Kolkata in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X