మోడీకి తల్లి ఆశీస్సులు: పంపాలో భార్య ప్రత్యేక పూజలు
బళ్లారి/ గాంధీనగర్: దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న బిజెపి నేత నరేంద్ర మోడీ గురువారం తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. గాంధీనగర్‌లోని ఓ చిన్న ఇంటిలో నివాసముంటున్న తల్లి హిర్బా దగ్గరకు మోడీ వెళ్లారు.
ప్రధాని కాబోతున్న కుమారుడిని ఆమె ఎంతో ఆనందంతో ఆశీర్వదించారు. మిఠాయి తినిపించి వందరూపాయలు కానుకగా ఇచ్చారు. దేశానికి ప్రధాని అయినా తనకు మాత్రం కుమారుడేనని చెప్పకనే చెప్పారు.

కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ బుధవారం కర్ణాటక రాష్ట్రం హంపీ సమీపంలోని పంపా సరోవరాన్ని(కిష్కింధ ప్రాంతం) దర్శించుకున్నారు. గుజరాత్ నుంచి సుమారు 800 మంది యాత్రికులతో ప్రత్యేక రైలులో చార్‌థామ్ యాత్రలో భాగంగా ఆమె ఇక్కడకు వచ్చినట్లు సమాచారం.
హంపీకి బుధవారం మధ్యాహ్నం వచ్చిన జశోదాబెన్ యాత్ర ముగించుకుని పంపా సరోవరంలోని జయలక్ష్మీ దేవిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి బాబారామ్‌దాస్ ఆశీర్వాదం పొంది వెళ్లినట్లు ఆయల కమిటీ సభ్యులు తెలిపారు. ఆమె పంపా సరోవర దర్శనాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు.












Click it and Unblock the Notifications