ఢిల్లీ మెట్రో రైల్లో మోడీ జర్నీ: ఎంజాయ్ చేశానని ట్వీట్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దక్షిణ ఢిల్లీలోని ధౌలా కువాన్ నుంచి పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా వరకు మెట్రో రైలులో మోడీ పయనించారు. ఈ సందర్భంగా మోడీ ట్వీట్ చేశారు.

మెట్రో రైలులో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని ప్రశసించారు. అంతే కాకుండా థాంక్యూ ఢిల్లీ మెట్రో.. థాంక్యూ శ్రీధరన్‌జీ అని ట్వీట్ చేశారు. మోడీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించడం ఇదే తొలిసారి.

భద్రతా ఏర్పాట్ల వల్ల ప్రజలకు రోడ్డు మార్గంలో వెళ్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మోడీ మెట్రో రైల్లో ప్రయాణించారు. జాతీయ ఇంటిలిజెన్స్ అకాడమీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

 Narendra Modi travels by Delhi metro, tweets 'really enjoyed the ride'

ప్రధాని ప్రయాణించినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి వాహనాలను ఆపేయడం పరిపాటి. గతంలో కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు మెట్రో రైల్లో ప్రయాణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+