దీంతో సంతోషం లేదు!: దుబాయ్‌లో భారతీయులతో మోడీ, ఒపేరాలో హోరెత్తిన మోడీ నినాదాలు (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: యూఏఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఓపేరా హౌస్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏఈలో 30 లక్షల మంది భారతీయులు ఉన్నారని చెప్పారు. ప్రవాస భారతీయుల కృషి అభినందనీయమన్నారు. హిందూ దేవాలయా నిర్మాణానికి అనుమతి ప్రశంసనీయమన్నారు.

భారత్ - యూఏఈల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో శరవేగంగా ముందుకు పోతోందన్నారు. ప్రతి నిరుపేదను ఆదుకోవడమే ప్రభుత్వం ఏకైక లక్ష్యమని చెప్పారు.

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

యూఏఈలో ప్రధాని మోడీ చేతుల మీదుగా తొలి హిందువుల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 55వేల చదరపు మీటర్ల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తారు. బోచసాన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ(బీఏపీఎస్‌) ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణ ప్రాజెక్టు జరుగుతోంది.

గల్ఫ్‌లో సొంత దేశంలో ఉన్నట్లు

గల్ఫ్‌లో సొంత దేశంలో ఉన్నట్లు

ఆలయ శంకుస్థాపన అనంతరం మోడీ దుబాయ్‌లోని ఒపేరా హౌస్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. బాయ్‌లోని ప్రవాస భారతీయులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారత్‌ నుంచి వచ్చిన 30లక్షల మందికి గల్ఫ్ దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయని, సొంత దేశంలో ఉంటున్న భావన కలిగేలా చేస్తున్నందుకు కృతజ్ఞతలు అన్నారు.

ఈ ఆలయం సందేశం కూడా ఇస్తుంది

ఈ ఆలయం సందేశం కూడా ఇస్తుంది

హిందువుల కోసం ఆలయ నిర్మాణానికి అంగీకరించిన దుబాయ్‌ యువరాజుకు 125 కోట్ల భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోడీ అన్నారు. ఈ ఆలయం ప్రత్యేకంగా ఉండటమే కాదని, వసుధైక కుటుంబనే సందేశాన్ని కూడా ఇస్తుందన్నారు.

దీంతో సంతోషం చెందడం లేదు

దీంతో సంతోషం చెందడం లేదు

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ర్యాంకు 142 నుంచి 100కి చేరడం సంతోషించదగ్గ విషయమని మోడీ అన్నారు. కానీ దీంతో మేము సంతృప్తి చెందడం లేదని, దీనిని మరింత మెరుగుపడేలా చేసేందుకు కృషి చేస్తామని, మీ కలలను నిజం చేసేందుకు సమష్టి కృషి చేస్తామన్నారు.

మోడీ నినాదాలతో హోరెత్తిన ఒపేరా

మోడీ నినాదాలతో హోరెత్తిన ఒపేరా

ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద సంస్కరణలైన జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలను మోడీ ప్రస్తావించారు. పేద ప్రజలు కూడా నోట్ల రద్దును అంగీకించారన్నారు. జీఎస్టీ నిర్ణయం కూడా సరైనదేనని మరో ఏడేళ్లలో ప్రజలు విశ్వసిస్తారన్నారు. చాలా సంవత్సరాల తర్వాత పొరుగు దేశాలతో భారత్‌ మెరుగైన సత్సంబంధాలను ఏర్పరుచుకుంటోందన్నారు. కాగా మోడీ మాట్లాడుతున్నంత సేపు ఒపేరా హౌస్‌ అంతా 'మోడీ.. మోడీ.. అనే నినాదాలతో హోరెత్తింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi who is on a four-day visit to three West Asian countries, on Sunday witnessed the foundation stone-laying ceremony for the first Hindu temple in the capital of the UAE, home to over three million people of Indian origin.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి