న్యూఢిల్లీ: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో విమాన ప్రమాదం తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఉదయం రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం అందులో ఒకటి.
రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం దిగాల్సిన సమయానికి రన్‌వేపై మరో విమానం ఉంది. పైలట్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
Congress vice-president Rahul Gandhi narrowly escaped a disaster while landing in Delhi when another aircraft was found to be still on the runway on which his private business jet had been cleared to land.