గ్రేట్ ఎస్కేప్: సినిమాల్లో తప్ప ఇలాంటి ఘటన చూసి ఉండరు..

Subscribe to Oneindia Telugu

జలంధర్: అచ్చు యాక్షన్ సినిమాల్లోని దృశ్యాన్ని తలపించేలా పంజాబ్ లోని జలంధర్ లో తాజాగా ఘటన చోటు చేసుకుంది. రెప్ప పాటు కాలంలో ఓ వ్యక్తి తన ప్రాణాలు దక్కించుకున్న తీరు విస్మయపరుస్తోంది. అనూహ్యంగా ఫ్లైఓవర్ నుంచి ఓ ట్రక్కు కింద పడటంతో.. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటో నుజ్జునుజ్జయిపోగా.. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

Truck

ప్రమాదం సమయంలో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తికి ఓ ట్రక్కు ఎదురురావడంతో.. రోడ్డుకు ఒక పక్క నుంచి ముందుకెళ్తున్నాడు. ఆ ట్రక్కు అతన్ని దాటిపోవడమే ఆలస్యం.. ఆ రోడ్డుకు సరిగ్గా పైనే ఉన్న ఫ్లైఓవర్ నుంచి ఓ ట్రక్కు బోల్తా పడింది.

అనూహ్యంగా జరిగిన ఈ ఘటనలో.. తొలుత ట్రక్కు టైర్లు తనవైపు దూసుకురావడాన్ని గమనించిన సైకిల్ వ్యక్తి.. వెంటనే సైకిల్ ను అక్కడ వదిలేసి పరుగందుకున్నాడు. రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు. అదే సమయానికి అటుగా వచ్చిన ఆటో మాత్రం ట్రక్కు కింద నుజ్జయిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Narrow escape for two as truck falls off a flyover in Jalandhar, truck driver and an auto-rickshaw driver suffer injuries.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి