ఘోర ప్రమాదం: బావిలో పడిన బస్సు, ఆటో: 20 మంది మృతి
Recommended Video
#WatchVideo : Bus Falls Into Well After Collision With Rickshaw || Oneindia Telugu
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షా, బస్సు ఒకదానికొకటి ఢీకొని సమీపంలోని వావిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు.

నాసిక్‌లోని మాలేగావ్ నుంచి మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్ఆర్టీసీ) కి చెందిన ఓ బస్సు కల్వాన్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో డియోలా ప్రాంతం వద్ద ఆటో రిక్షాను డీకొట్టి అదుపుతప్పి రెండు వాహనాలు కూడా పక్కనే ఉన్న బావిలో పడ్డాయి.
ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ బావి 70 అడుగుల లోతు ఉందని అధికారులు చెప్పారు. ప్రయాణికులందరిని సహాయ బృందాలు బయటికి తీశాయని తెలిపారు.












Click it and Unblock the Notifications