వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: 2019లో ఐటీలో లక్ష కొత్త ఉద్యోగాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే ఏడాదిలో ఐటీ విభాగంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని నాస్కామ్ అభిప్రాయపడింది. 2019 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ 10-12 శాతం ఆదాయాన్ని అంచనా వేసినట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ ప్రకటించారు.నాస్కామ్‌ రిపోర్ట్‌ ప్రకారం 30 శాతం వాటాతో 2017-18లో ఐటి సేవల మొత్తం ఆదాయంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ విభాగం నిలిచినట్టు నాస్కామ్ ప్రకటించింది.

ఐటీ రంగంలో ఇటీవల కాలంలో ఆశించిన మేరకు రిక్రూట్‌మెంట్స్ లేవు.ఈ తరుణంలో వచ్చే ఏడాది ఐటీ రంగంలో ఆశించిన విధంగా రిక్రూట్‌మెంట్స్ ఉంటాయని నాస్కామ్ అభిప్రాయపడింది.

ఐటీ పరిశ్రమ విభాగం సంస్థ నాస్కామ్‌ 2017-18 ఐటీ రిపోర్ట్ ను విడుదల చేసింది. వరుసగా రెండవ సంవత్సరం ఐటీ పరిశ్రమ వృద్ది ఫ్లాట్‌గా ఉందని, అయితే రాబోయే ఏడాదికి పరిస‍్థితి మెరుగ్గా ఉంటుందని తెలిపింది.

వచ్చే ఏడాది ఐటీలో లక్ష ఉద్యోగాలు

వచ్చే ఏడాది ఐటీలో లక్ష ఉద్యోగాలు

2019లో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని నాస్కామ్ అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ 10-12 శాతం ఆదాయాన్ని అంచనా వేసినట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు వస్తాయనీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పింది.అయితే ఈ వృద్ధి అంచనా వేసిన దాని కంటే 50శాతం తక్కువని వెల్లడించింది.

ఎగుమతుల వృద్ది రేటు 7 నుండి 8 శాతం

ఎగుమతుల వృద్ది రేటు 7 నుండి 8 శాతం

వచ్చే ఏడాదికి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7-8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. నాస్కామ్‌ రిపోర్ట్‌ ప్రకారం 30 శాతం వాటాతో 2017-18లో ఐటి సేవల మొత్తం ఆదాయంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ విభాగం నిలిచింది. ఇంజనీరింగ్, ఆర్ అండ్ డి 13 శాతం, వ్యాపార ప్రక్రియ నిర్వహణ 8 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

24 శాతం ఐటీ ఎగుమతులు

24 శాతం ఐటీ ఎగుమతులు

2018-19 నాటికి 10-12 శాతం వృద్దితో 167 బిలియన్ డాలర్స్ ఆదాయం సాధించ వచ్చన్నారు. భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 24శాతం ఐటీ ఎగుమతులే. డిజిటల్‌ బిజినెస్‌1.5-2శాతం వృద్ధిని నమోదు చేయనుండగా, దేశీయంగా ఇది రెండంకెల వృద్ధి కొనసాగే అవకాశం ఉందని నాస్కామ్ అభిప్రాయపడింది.

దేశీయ ఆదాయం 10-11 శాతం పెరుగుదల

దేశీయ ఆదాయం 10-11 శాతం పెరుగుదల

దేశీయ ఆదాయం 10-11 శాతం పెరిగింది. అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉందనీ, ట్రెండ్‌ పాజిటివ్‌గానే ఉండటంతో మంచి వ్యాపార అవకాశాలు లభించనున్నాయని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. దీంతో స్టాక్‌మార్కెట్లో ఐటీ రంగ షేర్లు బాగా లాభపడుతున్నాయి.గత జూన్లో నాస్కామ్ 2018 ఆర్థిక సంవత్సరానికి ఫ్లాట్ వృద్ధి రేటును అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు ఆదాయాలు కేవలం 7.6 శాతం మాత్రమే పెరిగాయని నాస్కామ్ చెప్పారు.

English summary
Software industry lobby Nasscom today projected a flat growth revenue scenario for the industry in FY19, clipping at 7-9 percent over FY18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X