థియేటర్లలో జాతీయగీతం ప్రసారం తప్పనిసరి: సుప్రీం
సినిమా థియేటర్లతో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లతో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని చేయాలని ఆదేశాలు జారీచేసింది.
జాతీయగీతాన్ని, జాతీయ జెండాను దేశ పౌరులందరూ తప్పనిసరిగా గౌరవించాలని అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. జాతీయ జెండాను తెరపై ప్రదర్శించాలని పేర్కొంది.

జాతీయగీత ప్రదర్శన సమయంతో థియేటర్లలో ఉన్న ప్రతి ఒక్కరూ నిలబడే ఉండాలని సూచించింది. ఈ మేరకు అమలు జరగాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం దీనిపై ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ప్రచారం చేస్తుందని తెలిపింది.












Click it and Unblock the Notifications