జాతీయ పురుష కమీషన్ కావాలి: మగవాళ్ళకు పెద్ద కష్టమే!!

సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి తమ కోసం జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషన్లు దాఖలు చేస్తూ తమ డిమాండ్ ను దేశానికి తెలియజేస్తున్నారు భారతీయ పురుషులు.

ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త డిమాండ్ వినిపిస్తుంది .మహిళలకే హక్కులు, చట్టాలు, శాసన బద్ధ సంస్థలు ఉంటే మరి మమ్మల్ని పట్టించుకునే వారెవరు అంటూ మగవారు రోడ్డు ఎక్కుతున్నారు. మహిళలకేనా సమస్యలు మగవారికి లేవా అని ప్రశ్నిస్తున్నారు. మహిళలకేనా జాతీయ మహిళా కమిషన్.. మగవారి కోసం జాతీయ పురుష కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటుకు మగవాళ్ళ డిమాండ్

జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటుకు మగవాళ్ళ డిమాండ్

ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి తమ కోసం జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషన్లు దాఖలు చేస్తూ తమ డిమాండ్ ను దేశానికి తెలియజేస్తున్నారు భారతీయ పురుషులు. ఇప్పుడు భారతదేశంలో పురుషులకు పెద్ద కష్టమే వచ్చింది. ఒకప్పుడు మహిళలకు మాత్రమే పరిమితమైన హింస, ఇప్పుడు పురుషుల పైన కూడా కనిపిస్తుంది.

మగవాళ్ళని వేధిస్తున్న ఆడవాళ్లు, ఆడవాళ్ళ టార్చర్ తో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న మగవాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని, తమ హక్కుల కోసం చట్టాలను రూపొందించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు పురుష పుంగవులు.

సుప్రీం కోర్టులో పిటీషన్

సుప్రీం కోర్టులో పిటీషన్

జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏకంగా పిటీషన్ దాఖలు చేశారు. పెళ్లి చేసుకున్న మగవాళ్ళు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో, పురుషుల ఆత్మహత్యల కట్టడికి మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్ ద్వారా సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

జాతీయ నేర గణాంకాల ప్రకారం 2021లో 81,063 మంది పెళ్లయిన పురుషులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇందులో పేర్కొన్నారు. ఇక చాలామంది ఇందులో 4.8% వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలతో చనిపోయారని వెల్లడించారు.

పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య.. అందుకే జాతీయ పురుష కమీషన్

పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య.. అందుకే జాతీయ పురుష కమీషన్

28,680 మంది వివాహితలు ఆత్మహత్య చేసుకుంటే పురుషులే 80 వేలకు పైగా అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి, మగవాళ్ళ సమస్యల సాధన కోసం, ఆత్మహత్యల కట్టడి కోసం జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మొత్తానికి పురుషులు సైతం తమకు జరుగుతున్న అన్యాయం పట్ల నోరు విప్పి జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+