వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ పార్టీలకు గుప్త ఆదాయం రూ. 15,077 కోట్లు: ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ టాప్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు 2004-05, 2020-21 మధ్య కాలంలో తెలియని మూలాల నుంచి రూ. 15,077.97 కోట్లకు పైగా వసూలు చేశాయని పోల్ హక్కుల సంఘం - అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన విశ్లేషణలో తేలింది. పార్టీల ఆదాయపు పన్ను రిటర్న్‌లు, భారత ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన విరాళాల ప్రకటనల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది.

2020-21కి పార్టీల ఆదాయం రూ. 690 కోట్లు

2020-21కి పార్టీల ఆదాయం రూ. 690 కోట్లు

2020-21కి సంబంధించి తెలియని మూలాల నుంచి జాతీయ, ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం ₹690.67 కోట్లు.

ఈ విశ్లేషణ కోసం ఏడీఆర్ ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణించింది.
జాతీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), కమ్యూనిటీ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ),నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలలో ఏఏపీ, ఏజీపీ, ఏఐఏడీఎంకే, ఏఐఎఫ్బీ, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్, బీజేడీ, సీపీఐ(ఎంఎల్-ఎల్), డీఎండీకే, డీఎంకే, జీఎఎఫ్పీ, జేడీఎస్, జేడీయూ, జేఎంఎం, కేసీ-ఎం, ఎంఎన్ఎస్, ఎన్డీపీపీ, ఎన్పీఎఫ్, పీఎంకే, ఆర్ఎల్డీ, ఎస్ఏడీ, ఎస్డీఎఫ్, శివసేన, ఎస్కేఎం, టీడీపీ, టీఆర్ఎష్, వైయస్సార్సీపీ ఉన్నాయి.

రూ. 15,077 కోట్లు పార్టీల గుప్త ఆదాయం

రూ. 15,077 కోట్లు పార్టీల గుప్త ఆదాయం

పార్టీల ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR), భారత ఎన్నికల సంఘం (ECI)కి దాఖలు చేసిన విరాళాల ప్రకటనల ఆధారంగా జరిపిన విశ్లేషణలో FY 2004-05, 2020-21 మధ్య జాతీయ పార్టీలు తెలియని మూలాలు నుంచి ₹15,077.97 కోట్లు వసూలు చేశాయని తేలింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి, ఎనిమిది జాతీయ రాజకీయ పార్టీలు తెలియని మూలాల నుంచి ₹ 426.74 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయి. 27 ప్రాంతీయ పార్టీలు తెలియని మూలాల నుంచి ₹ 263.928 కోట్ల ఆదాయాన్ని పొందాయి.

గుప్త ఆదాయం కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ, తర్వాత బీజేపీ

గుప్త ఆదాయం కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ, తర్వాత బీజేపీ

FY 2020-21లో, కాంగ్రెస్ తెలియని మూలాల నుంచి ₹178.782 కోట్ల ఆదాయం ప్రకటించింది, ఇది జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 41.89% తెలియని మూలాల నుంచి (₹426.742 కోట్లు)" అని విశ్లేషణ తెలిపింది.

బీజేపీ ₹100.502 కోట్లను తెలియని మూలాల నుంచి ఆదాయంగా ప్రకటించింది, ఇది జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 23.55% తెలియని మూలాల నుంచి వచ్చింది.

ప్రాంతీయ పార్టీల్లో గుప్త ఆదాయంలో వైయస్సార్సీపీనే టాప్

ప్రాంతీయ పార్టీల్లో గుప్త ఆదాయంలో వైయస్సార్సీపీనే టాప్

తెలియని ఆదాయంలో మొదటి ఐదు ప్రాంతీయ పార్టీలు వైయస్సార్-కాంగ్రెస్ రూ. 96.2507 కోట్లు, డీఎంకేతో ₹80.02 కోట్లు, బీజేడీ ₹67 కోట్లు, ఎంఎన్ఎస్ ₹5.773 కోట్, ఆప్ ₹5.4 కోట్లు. మొత్తం ₹690.67 కోట్లలో 47.06% ఎలక్టోరల్ బాండ్ల ఆదాయానికి సంబంధించినది.

FY 2004-05, 2020-21 మధ్య కాలంలో కూపన్‌ల విక్రయం ద్వారా కాంగ్రెస్, ఎన్సీపీ ఉమ్మడి ఆదాయం ₹4,261.83 కోట్లుగా ఉందని ఏడీఆర్ తెలిపింది. కాగా, FY 2020-21 కోసం ఏడు రాజకీయ పార్టీల ఆడిట్, కంట్రిబ్యూషన్ రిపోర్ట్‌లలో రిపోర్టింగ్ వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ ఏడు పార్టీలలో AITC, CPI, AAP, SAD, KC-M, AIFB, AIUDF ఉన్నాయి.

English summary
National parties collected Rs 15,077 cr from unknown sources between FY 2004-05, 2020-21: ADR report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X