వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారం దిశగా ఎన్డీయే..! మేజీక్ ఫిగర్ ను అదిగమించిన కాషాయ మిత్రపక్షం...!

|
Google Oneindia TeluguNews

దిల్లీ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 542 స్థానాలకు గానూ.. 305 చోట్ల ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 116 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి, 99 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చాలా చోట్ల ప్రముఖుల సైతం వెనుకంజలో ఉన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే ముందంజలో ఉంది. మొత్తం 80 నియోజకవర్గాలుండగా.. 56 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థులు 16చోట్ల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాల్లోనే ఆధిక్యంలో కనబరిచింది. ఇక గత ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన గుజరాత్‌లోనూ బీజేపీ జోరు కొనసాగుతోంది. గుజరాత్‌లో మొత్తం 26 స్థానాలుండగా.. 22 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటకలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్‌ మొత్తం 28 స్థానాల్లో 22 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 20 చోట్ల బీజేపీ ముందంజలో ఉంది.

national politics,nda, bjp, congress,prime minister modi,rahul gandhi,priyanka gandhi.amith shah.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు తగ్గట్లు కేంద్రంలో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు సిద్ధార్థ్‌ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలో రాకపోతే తాను ట్విటర్‌ నుంచి తప్పుకొంటానని అన్నారు. ఇంకెప్పటికీ ట్విటర్‌ ఖాతాను తెరవనని తేల్చి చెప్పారు. అయేగా తో మోదీ హీ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో భాజపానే మళ్లీ అధికారంలోకి వస్తుందని వెల్లడైనప్పుడు మాత్రం సిద్ధార్థ్‌ నెగిటివ్‌గా కామెంట్‌ చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ కేవలం అంచనాలు మాత్రమే. కానీ అసలైన ఫలితాల కోసం వేచి చూడాలి. ఈలోగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కలిగే మార్పేమీ ఉండదని మనం గుర్తించాలి. గందరగోళానికి గురై ప్రయోజనం లేదు. అంచనాలను చూసి మురిసిపోవనవసరం లేదని పేర్కొన్నారు.

English summary
n the results of the general elections, the BJP-led NDA is stepping up power, Of the 542 seats, the NDA alliance is ahead in 305 seats. In the 116 constituencies, the Congress-led United Progressive Alliance (UPA) and others are leading in 99 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X