NEET: నీట్ పేపర్ నిజంగానే లీక్ అయిందా..!

నీట్ పేపర్ లీక్ అయిందని పరీక్ష జరిగిన నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత నీట్ పేపర్ లీక్ అయినట్లు భారీ ఆరోపణలు వస్తున్నాయి. ఒకే సెంటర్ చాలా మంది విద్యార్థులు ర్యాంక్ సాధించడం, భారీగా మార్కులు పొందడంతో నిజంగానే నీట్ పేపర్ లీక్ అయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనిపై కొంత మంది విద్యార్థులు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు.

నీట్ పేపర్ లీక్ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్ సుబోద్ కుమార్ మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేశారు. లీక్ అయిందని వాస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. నీట్ పరీక్ష ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ పరీక్షలో 1,500 మందికి పైగా అభ్యర్థులకు లభించిన గ్రేస్ మార్కులను సమీక్షించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ నలుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.

National Testing Agency NTA Director General Subodh Kumar responded on the NEET paper leak


4,750 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు చెప్పారు. కేవలం ఆరు కేంద్రాల్లో మాత్రమే సమస్య వచ్చిందన్నారు. ప్రశ్నాపత్రాలను తప్పుగా పంపిణీ చేయడం వల్ల 24 లక్షల మంది అభ్యర్థులలో, 1,600 మంది అభ్యర్థులు మాత్రమే ప్రభావితమయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రత కాపాడటంలో ఎలాంటి రాజీ పడలేదన్నారు. పరీక్షలో తమకు తక్కువ సమయం లభించిందని కొంతమంది అభ్యర్థులు చెప్పారని గుర్తు చేశారు. దీని కోసం కేంద్రాల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించినట్లు పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీ వారంలోగా నివేదిక ఇస్తుందన్నారు. ఎన్టీఏ జూన్ 4న నీట్ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. నీట్ చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు పొందరు. ఏకంగా 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫస్ట్​ ర్యాంక్ సాధించడంతో పేపర్ లీక్ అయిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+