వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు అరుదైన గౌరవం.. టూరిజంలో రెండు అవార్డులు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : తెలంగాణకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో పర్యాటక శాఖ రెండు అవార్డులు గెలుచుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా ఈ ఏడాదికి గాను రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది టూరిజం డిపార్టుమెంట్. గత నాలుగేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటక అవార్డులు అందుకుంటూనే ఉంది. ఆ క్రమంలో ఈసారి కూడా జాతీయ స్థాయిలో తెలంగాణ టూరిజం విభాగం రెండు పురస్కారాలు దక్కించుకోవడంతో హర్షం వ్యక్తమవుతోంది.

ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ మొబైల్ యాప్‌‌కు అవార్డు

ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ మొబైల్ యాప్‌‌కు అవార్డు

తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందిస్తున్న "ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ" అనే మొబైల్ యాప్‌కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. అదే క్రమంలో ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం అనే విభాగం లో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి మరో అవార్డు సొంతం చేసుకుంది. తెలంగాణకు ఈసారి రెండు అవార్డులు దక్కడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

<strong>దసరా పండుగ వేళ.. స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లు</strong><br />దసరా పండుగ వేళ.. స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లు

పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం

పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం

"ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ" అనే మొబైల్ యాప్‌కు ఐటీ యొక్క అత్యంత వినూత్న ఉపయోగం - సోషల్ మీడియా / మొబైల్ అనువర్తనం, వెబ్ సైట్ విభాగంలో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన యాప్‌కు పలువురి ప్రశంసలు దక్కడంతో పాటు అరుదైన అవార్డు దక్కింది. తెలంగాణలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఫింగర్ టిప్ మీద ఈ యాప్‌లో దొరుకుతుండటంతో ఈ పురస్కారం దక్కినట్లైంది.

దసరా పండుగ వేళ.. స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లుదసరా పండుగ వేళ.. స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లు

అపొలో ఆసుపత్రికి వైద్య పర్యాటక సౌకర్యం అవార్డు

అపొలో ఆసుపత్రికి వైద్య పర్యాటక సౌకర్యం అవార్డు

భారత దేశంలో ఆధునిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం, మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రిగా, ప్రైవేట్ హెల్త్ కేర్ విప్లవానికి నాంది పలికిన హైదరాబాద్ అపోలో ఆసుపత్రి ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం విభాగంలో అవార్డు దక్కించుకుంది. అంతర్జాతీయ టూరిజం దినోత్సవం సందర్భంగా ఇండియా టూరిజం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి అవార్డుల్లో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖ రెండు అవార్డులను గెలుచుకోవడం విశేషం.

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వండి.. యునెస్కో ప్రతినిధులకు ఎమ్మెల్సీ వినతిరామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వండి.. యునెస్కో ప్రతినిధులకు ఎమ్మెల్సీ వినతి

ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవం

ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవం

ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని జాతీయ పర్యాటక దినోత్సవాన్ని న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా నిర్వహించింది ఇండియా టూరిజం డిపార్టుమెంట్. ఈ సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, UNWTO సెక్రెటరీ జనరల్ జురాబ్ పొలాలి కశవిలి, కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది. తెలంగాణ టూరిజం విభాగానికి దక్కిన పురస్కారాన్ని తెలంగాణ క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు.

English summary
Telangana Tourism Got Two Awards In National Level. I Explore App and Apollo Hospital Got Awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X