లక్షద్వీప్ లో కూడా అభ్యర్థిని దింపారు! కుమార్తెకే తొలి ప్రాధాన్యత..తొలి జాబితా విడుదల!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీ నేషనలిస్ కాంగ్రెస్ పార్టీ..తన తొలి జాబితాను ప్రకటించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 12 అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో నాలుగు దశల్లో మిగిలిన అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామని ఎన్సీపీ నాయకులు తెలిపారు. తొలి జాబితాలో సుప్రియా సూలేకు స్థానం కల్పించారు. సుప్రియా సూలే.. ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ కుమార్తె. ఈ 12 స్థానాల్లో ఒకటి లక్షద్వీప్ కావడం విశేషం.

సుప్రియా సూలేకు బారామతి స్థానాన్నే కేటాయించారు. ప్రస్తుతం ఆమె అదే స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా సుప్రియా అదే స్థానం నుంచి పోటీ చేస్తారు. సునీల్ తత్కారే-రాయగఢ్, ఉదయన్ రాజె బోస్లే-సతారా, ధనంజయ్ మహాదిక్-కొల్హాపూర్, డాక్టర్ రాజేంద్ర సింఘణే-బుల్ధానా, గులాబ్ రావు దేవ్ కర్-జల్ గావ్, రాజేశ్ విటేకర్-పర్భణీ, సంజయ్ దినా పాటిల్-ముంబై ఈశాన్యం, ఆనంద్ పరాంజపే-థానే, బాబాజీ బలరామ్ పాటిల్-కళ్యాణ్, రాజు షెట్టి (స్వాభిమాని షెట్కారీ సంఘటన్)- హట్కనంగలే.. పేర్లను ప్రకటించారు. కాగా, లక్షద్వీప్ లోక్ సభ స్థానానికి మహమ్మద్ పీపీ ఫైజల్ పేరును ప్రకటించారు.

-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications