షాకింగ్ న్యూస్: పెరగనున్న సిలిండర్ ధర..? 57 శాతం అట..
ధరల పెరుగుదలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. పప్పు ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నూనెల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు అనేలా సిచుయేషన్ ఉంది. ఈ క్రమంలో మరోసారి సిలిండర్ ధరలు పెరుగుతాయనే సమాచారం ఉంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
ఇప్పటికే పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుంటే మరోపక్క ఎల్‌పీజీ గ్యాస్, వంట నూనె వంటి నిత్యావసర ధరల పెరుగుదలతో బ్రతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెలలో మరో భారం పడనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. వచ్చే నెల అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ ధరలు ఏకంగా 57 - 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ ధరలు నిజంగానే పెరిగితే ఇక వాటిని కొనాలంటే సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన డొమెస్టిక్ గ్యాస్ పాలసీ నియమాల ప్రకారం.. ప్రతి 6 నెలలకు ఒకసారి నేచురల్ గ్యాస్ ధరలను సమీక్షిస్తుంది. అయితే, ఈ సమీక్షలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం చూస్తే వచ్చే నెలలో దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు అధిక మొత్తంలో పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Recommended Video
ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర మీ.మీ.బీ.టీ.యుకు 1.79 డాలర్‌గా ఉంటే ఇది వచ్చే నెల 3 డాలర్ల పైకి పెరగవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. విదేశీ మార్కెట్‌లో నేచురల్ గ్యాస్ ధర సెప్టెంబర్ 8న ఒక్క రోజే 8 శాతం పెరిగింది. 57 శాతం అంటే మాములు కాదు.. ఇప్పుడే 900 పైచిలుకు ధర ఉంది.












Click it and Unblock the Notifications