వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 లక్షలు, 10 లక్షలు.. 6 లక్షలు: ఇన్నీ కొలువులు ఇస్తారట.. బీహర్‌లో జోరుగా పార్టీల హామీలు..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ వేళ ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తోన్నాయి. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్న ఉద్యోగాల కల్పన కీలకం. ఆ అంశాన్ని బీజేపీ, ఆర్జేడీ అందుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో లక్షలాది మంది బీహరీలు స్వరాష్ట్రం చేరుకొన్న క్రమంలో ఉపాధి కల్పన పేరుతో ఆకట్టుకున్నాయి.

కర్ణాటకకు రూ.1200 కోట్లు, బీహర్ రూ.200 కోట్లు.. అడిషనల్ గ్రాంట్ రిలీజ్కర్ణాటకకు రూ.1200 కోట్లు, బీహర్ రూ.200 కోట్లు.. అడిషనల్ గ్రాంట్ రిలీజ్

46.6 శాతానికి చేరిన నిరుద్యోగిత

46.6 శాతానికి చేరిన నిరుద్యోగిత

ఈ ఏడాది మార్చిలో నిరుద్యోగిత 31 శాతం నుంచి 46.6 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ తెలిపింది. ఆ నెలలో దేశంలో నిరుద్యోగిత శాతం 23.5 శాతానికి చేరింది. కానీ 2019 జూన్‌లో అదీ 10.2 శాతంగా ఉండేది. జాతీయ సగటు మాత్రం 5.8గా ఉంది. ఈ క్రమంలో ఉపాధి కోసం బీహరీలు పొరుగు రాష్ట్రాల్లోకి వచ్చారు. అయితే ఎన్నికల వేళ తిరిగొచ్చిన వారికి ఉపాధి కల్పించడం ప్రధాన పార్టీలకు కత్తిమీద సాములా మారింది.

10 లక్షలు..

10 లక్షలు..

నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు జేడీయూ ప్రణాళిక రచించింది. బీహర్ ప్రభుత్వ పాఠశాలల్లో 94 వేల టీచర్ కొలువులను భర్తీ చేస్తామని తెలిపింది. దీంతో మిగతా పార్టీలు కూడా అదే స్వరం అందుకున్నాయి. తమ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఇదే అంశాన్ని ప్రతీ ర్యాలీలో ఆయన ప్రస్తావిస్తు వస్తున్నారు.

 జైలు నుంచి డబ్బులొస్తాయా..

జైలు నుంచి డబ్బులొస్తాయా..

తేజస్వీ యాదవ్ హామీని నితీశ్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. ఇదీ ఎన్నికల జిమ్మిక్ అని.. వారందరికీ ఉపాధి కల్పించడం ఎలా అని అడిగారు. వారి వేతనం ఇవ్వాలంటే ఎక్కడినుంచి ఇవ్వాలి.. జైలు నుంచి నగదు వస్తోందా అని అడిగారు. పశు దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్ యాదవ్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం ఇప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగం కల్పించిందని నితీశ్ కుమార్ తెలిపారు.

19 లక్షలు..

19 లక్షలు..

జేడీయూ-ఆర్జేడీ మధ్య మాటల మంటలు ఇలా కొనసాగుతుంటే.. బీజేపీ రంగంలోకి దిగింది. ఆర్జేడీ కన్నా ఎక్కువగా 19 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నది. ఇవాళ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో విడుదల చేశారు. తాము ఇస్తోన్న హామీలను ఎలా నెరవేరుస్తామనే అంశాన్ని వివరించారు. 2 లక్షల మందికి ఉపాధి, 3 లక్షల మంది టీచర్ల, బీహర్ అభివృద్ది కోసం 5 లక్షల మంది. 1 లక్ష మంది వైద్యారోగ్యశాఖలో కొలువు ఇస్తామని వివరించారు.

Recommended Video

Bihar Elections 2020 : BJP Manifesto- Free Covid Vaccine Only In Bihar? Questions Raised || Oneindia
రూ.50 వేల కోట్లు

రూ.50 వేల కోట్లు

మహిళల స్వయం సమృద్ది కోసం రూ.50 వేల కోట్లు కేటాయిస్తామని సీతారామన్ వివరించారు. అంతేకాదు బీహరీలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. ఎల్జేపీ మాత్రం పనికి వేతనం అందిస్తామని తెలిపారు.

English summary
RJD, now led by chief ministerial hopeful Tejashwi Yadav, has promised to give 10 lakh jobs to the youth of Bihar if the Mahagathbandh is voted to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X