ఉద్దండుల పరాజయం.. నవజ్యోత్ సింగ్ సిద్దూ, రెండు చోట్ల చన్నీ ఓటమి
నవజ్యోత్ సింగ్ సిద్దూ.. క్రికెటర్ నుంచి పొలిటిషీయన్‌గా మారిన నేత. కానీ ఆనతి కాలంలోనే ఫైర్ బ్రాండ్ అయ్యారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక గుర్తింపును దక్కించుకున్నారు. ఈ సారి తమ పార్టీ విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆప్ ఘన విజయం సాధించింది. అయితే సిద్దూ కూడా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే పాటియాలా నుంచి మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వరసలో సిద్దూ కూడా చేరారు. సిద్దూతోపాటు పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ కూడా జాయిన్ అయ్యారు. పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయాడు. చామ్ కౌర్ సాహిబ్, బాదౌర్‌లో చన్నీ ఓటమి పాలయ్యారు.
Recommended Video

3 సార్లు విజయం.. కానీ ఇప్పుడు
సిద్దూ ఇదివరకు అమృత్ సర్ నుంచి పోటీ చేసి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో ఆయన బీజేపీలో ఉండేవారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. మంత్రి పదవీ చేపట్టారు. తర్వాత పీసీసీ చీఫ్‌గా వ్యవహరించారు. కానీ ఈ సారి అమృత్ సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నానని సిద్దూ ట్వీట్ చేశారు. ఆప్‌కు ఆయన కంగ్రాట్స్ తెలియజేశారు.

సమస్యలు ఇవే..
అతను నియోజకవర్గంలో సరిగా సమన్వయం చేసుకోకపోవడం.. కౌన్సిలర్లతో సరిగా ఉండలేరట. దీంతో అతనికి కలిసి రాలేదు. అలాగే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. పరిస్థితి మరోలా ఉండేది. దీంతో సిద్దూకు వ్యతిరేకంగా గాలి వీచింది. అలాగే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సిద్దూకు స్నేహం ఉందని.. బీజేపీ బలంగా ప్రచారం చేసింది. ఇదీ కూడా ఆయన విజయంపై ప్రభావం చూపించింది. క్రికెటర్‌గా లైఫ్ స్టార్ట్ చేసి.. కామెంటర్‌గా కొనసాగి.. రాజకీయ నేతగా మారిన సిద్దూ.. గత 18 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తనదైన శైలిలో కామెంట్ చేసేవారు.

అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి
పంజాబ్‌లో చక్రం తిప్పాలని సిద్దూ అనుకున్నాడు. తమ పార్టీ విజయం తథ్యం అని అంచనా వేశారు. కానీ సిద్దూ వల్లే కాంగ్రెస్ ప్రభ తగ్గిందని విశ్లేషకులు అంటారు. మంత్రిగా ఉన్న సమయం నుంచి అమరీందర్‌తో పడలేదు. గత సెప్టెంబర్‌లో రాజీనామా కూడా చేసి హల్ చల్ చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అమరీందర్ సింగ్‌ను సీఎం పదవీ నుంచి తప్పించారు. అప్పుడు పీసీసీ చీఫ్‌గా కొనసాగుతోన్న.. సీఎం పోస్టుపై మనసు ఉండేంది. ఇంతలో చన్నీని సీఎం చేయడంతో మింగలేక కక్కలేని పరిస్థితి. అలా ఎన్నికలకు వచ్చి.. గెలుద్దామని అనుకున్నారు. కానీ ప్రజలు ఆప్ వైపు మొగ్గుచూపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications