వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బాయి కాస్తా అమ్మాయి అయింది.. నేవీ ఊద్యోగం కాస్తా ఊడింది!

లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఓ నావికుణ్ని భారత నౌకాదళం విధుల నుంచి తొలగించింది. మనీష్ గిరిలో లింగపరమైన భేదం ఏర్పడిందని, ఫలితంగా ఉద్యోగంలో కొనసాగించలేమని నేవీ అధికారులు పేర్కొన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఓ నావికుణ్ని భారత నౌకాదళం విధుల నుంచి తొలగించింది. మనీష్ కె గిరి అనే నాకాదళ ఉద్యోగి విశాఖపట్నంలోని ఓ నౌకాదళ స్థావరంలో విధులు నిర్వర్తించేవాడు.

గత ఏడాది సెలవు తీసుకుని.. ఆగస్టు నెలలో ముంబైలోని ఓ ఆసుపత్రిలో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తన పేరు కూడా 'షాబీ'గా మార్చుకున్నాడు. అనంతరం తిరిగి ఉద్యోగంలో చేరాడు.

Navy sacks sailor for undergoing sex change surgery

సెలవులో వెళ్లిన గిరి.. తిరిగి షాబీగా తిరిగి రావడంతో అతడి సహోద్యోగులు నిర్ఘాంతపోయారు. తమ పై అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పై అధికారులు ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖకు నివేదించారు. చివరికి దీనిని సర్వీసు నిబంధనల ఉల్లంఘనగా నౌకాదళం పేర్కొంది.

నౌకాదళంలో నియామకం అయ్యేనాటికి.. ఇప్పుడు లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత మనీష్ గిరిలో లింగపరమైన భేదం ఏర్పడిందని, ఫలితంగా ఉద్యోగంలో కొనసాగించలేమని నేవీ అధికారులు పేర్కొన్నారు.

మనీష్ కె గిరి 2010లో భారత నౌకాదళంలోని మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో చేరాడు. అప్పటికి అతడి వయసు 18 సంవత్సరాలు. ఆ తరువాత కొంతకాలానికి ఆంధ్రపదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన తూర్పు నౌకదళ స్థావరంలోని ఐఎన్ఎస్ ఏకశిల కమాండింగ్ ఆఫీసర్ గా పోస్టింగ్ తీసుకున్నాడు.

English summary
The Indian Navy has sacked a sailor for undergoing a sex change surgery last year, holding him guilty of breaching service rules. Manish Giri, a naval sailor, had undergone the sex change surgery in August at a hospital in Mumbai when he was on leave. “The Indian Navy has discharged Manish Giri, a naval sailor, evoking the clause of ‘Service No Longer Required’ under the Navy regulations,” the Navy said in a statement. It said the sailor who underwent “sex reassignment surgery” while on leave was administratively discharged from the service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X