ఐఎన్ఎస్ త్రిశూల్ దెబ్బకు.. తోక ముడిచిన సముద్ర దొంగలు!
భారత వాణిజ్య నౌక జాగ్ అమర్‌పై శుక్రవారం హెలికాప్టర్ సాయంతో పైరెట్లు దాడికి యత్నించారు. ఈ విషయం తెలియగానే ఐఎన్ఎస్ త్రిశూల్ రంగ ప్రవేశం చేసింది. త్రిశూల్ దెబ్బకు 12 మంది పైరెట్లు లొంగిపోయారు.
న్యూఢిల్లీ: భారత యుద్ధనౌక త్రిశూల్ దెబ్బకు సముద్ర దొంగలు తోక ముడిచారు. శుక్రవారం సోమాలియా సమీపంలోని గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా సరుకును తీసుకొస్తున్న భారత వాణిజ్య నౌక జాగ్ అమర్‌పై హెలికాప్టర్ సాయంతో పైరెట్లు దాడికి యత్నించారు.
అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలు, చమురుల నౌకలు లక్ష్యంగా పైరెట్లు దాడులకు పాల్పడుతుంటారు. 85 వేల టన్నుల సామర్థ్యం ఉన్న జాగర్ అమర్ నౌకపై దాడికి పాల్పడిన సమయంలో ఆ నౌకలో 26 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారు.

ఈ విషయం తెలియగానే ఐఎన్ఎస్ త్రిశూల్ రంగ ప్రవేశం చేసింది. త్రిశూల్ దెబ్బకు 12 మంది పైరెట్లు లొంగిపోయారు. వారి దగ్గర్నుంచి 14 ఏకే-47 తుపాకులను ఇండియన్ నేవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
2008 నుంచి భారత్ సహా ఇతర దేశాలకు చెందిన యుద్ధ నౌకలు తూర్పు ఆసియా తీర ప్రాంతంలో గస్తీ కాస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలకు పైరెట్ల బారినుంచి ఇవి రక్షణ కల్పిస్తున్నాయి.












Click it and Unblock the Notifications