Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదే కారణమా..? బాంద్రాలో వలస కూలీలు పోటెత్తిన ఘటనపై మంత్రి సంచలన ఆరోపణలు..

లాక్ డౌన్ పొడగింపు నేపథ్యంలో ముంబైలోని బాంద్రాలో వేలాదిమంది వలస కార్మికులు ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చిన సంగతి తెలిసిందే. మరో 19 రోజులు పనులు లేకుండా.. చేతిలో డబ్బులు లేకుండా ముంబైలో జీవనం సాగించడం కష్టమని.. తామంతా స్వస్థలాలకు వెళ్లిపోతామని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఒక దశలో లాఠీ చార్జి చేయాల్సి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.వలస కార్మికులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రకటించారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం అదేనంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీవీ న్యూస్ చానెలే కారణమన్న మంత్రి

టీవీ న్యూస్ చానెలే కారణమన్న మంత్రి

బాంద్రా వలస కార్మికుల ఘటనపై జాతీయ మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్.. ఓ టీవి చానెల్ వల్లే ఇదంతా జరిగిందన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత.. లాక్ డౌన్ గైడ్ లైన్స్‌ను ప్రస్తావిస్తూ రైలు సర్వీసులకు మినహాయింపునిచ్చే అవకాశం ఉందని ఓ టీవీ చానెల్ ప్రసారం చేసిందన్నారు. ఆ ప్రచారం వల్లే వేల సంఖ్యలో వలస కార్మికులు బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారని ఆరోపించారు. వలస కార్మికులకు అవసరమైన ఆహారం,నివాస ఏర్పాట్లను ప్రభుత్వం సమకూరుస్తోందని.. కేంద్రమే వారి పట్ల స్పష్టమైన పాలసీని ప్రకటించాల్సి ఉందని మాలిక్ అన్నారు.

మహారాష్ట్రలో అందుకే ఎక్కువ కేసులు.. : నవాబ్ మాలిక్

మహారాష్ట్రలో అందుకే ఎక్కువ కేసులు.. : నవాబ్ మాలిక్

వలస కార్మికులను ప్రత్యేక బస్సుల్లో లేదా రైళ్లల్లో స్వస్థలాలకు పంపించాలంటే.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని.. కానీ దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమని స్పష్టం చేశారు. దేశంలో నమోదవుతున్న మూడొంతుల కేసుల్లో ఒక వంతు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నందునే ఎక్కువ కేసులను గుర్తించగలుగుతున్నామని తెలిపారు. దేశంలో నిర్వహిస్తున్న టెస్టుల్లో సగం టెస్టులు మహారాష్ట్రలోనే జరుగుతున్నాయని చెప్పారు. 80శాతం కేసుల్లో ఎలాంటి సమస్య ఉండట్లేదని.. కానీ ఎవరైతే చివరి నిమిషంలో ఆసుపత్రికి వస్తున్నారో.. వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని అన్నారు.

బాంద్రా ఘటనలో ఒకరు అరెస్ట్..

బాంద్రా ఘటనలో ఒకరు అరెస్ట్..

బాంద్రా రైల్వే స్టేషన్ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు నేవీ ముంబైకి చెందిన వినయ్ దూబే అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్టు వల్లే భారీ సంఖ్యలో వలస కార్మికులు అక్కడికి చేరుకున్నారన్న ఆరోపణలతో బుధవారం తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టిన పోస్టుపై అతన్ని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు అతను.. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు,ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఏప్రిల్ 18న దేశవ్యాప్త నిరసనకు దిగుతామని ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు.

రెచ్చగొట్టే పోస్టులు పెట్టాడని ఆరోపణలు

రెచ్చగొట్టే పోస్టులు పెట్టాడని ఆరోపణలు

దూబే రెచ్చగొట్టుడు పోస్టుల వల్లే వలస కార్మికులు భారీగా బాంద్రా రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అతనిపై 153A,117,188,269,270 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది. కాగా,మొదటి విడత లాక్ డౌన్ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో వేలాది సంఖ్యలో వలస కూలీలు స్వస్థలాల బాట పట్టిన సంగతి తెలిసిందే. తాజా రెండో విడతలో ఆర్థిక రాజధాని ముంబైలోని వలస కూలీలు తమ స్వస్థలాలకు పంపించాలని రోడ్డెక్కారు.

Recommended Video

    India Lockdown : Churches in Across India Remain Shut On Easter

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+