ఉగ్ర మూకలపై ఉక్కుపాదం : పాకిస్థాన్ కు ఇండియా వార్నింగ్
న్యూఢిల్లీ : సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని భారత్ స్పష్టంచేసింది. ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని మరోసారి తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి అంటూనే .. మరోవైపు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడింది. దీంతోపాటు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం ఏంటని ప్రశ్నించింది. ఓ వైపు శాంతి వచనాలు వల్లిస్తూ .. మరోవైపు హింసను ప్రోత్సహిస్తున్నారని హెచ్చరించింది.
పుల్వామా ఘటనతో మారిన పరిస్థితి
గత కొన్నేళ్లుగా జరుగుతోన్న ఉగ్రవాద చర్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. పుల్వామా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాడులు, ప్రతీ దాడులతో హోరెత్తింది. అవసరమైతే యుద్ధానికి వెనుకాడబోమని సంకేతాలు ఇవ్వడంతో పాకిస్థాన్ తోకముడించింది. కానీ సరిహద్దులో కాల్పులకు తెగబడటంతో భారత విదేశాంగ మరోసారి స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.

నీరవ్ మోదీని ఎవరు కాపాడుతున్నారు ? లండన్ వీధుల్లో తిరుగుతుంటే పట్టుకోరా ? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
నయా పాకిస్థాన్ లో నయా యాక్షన్
పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద చర్యలను అరికట్టడం లేదు. నయా పాకిస్థాన్ అంటే ఇదేనా .. మీ నేలలో ఉగ్ర మూకలకు శిక్షణ ఇస్తారా ? మీ చర్యలు అలా ఉంటే వాటిని మేం కూకటివేళ్లతో పెకిలిస్తామన్నారు రవీశ్ కుమార్. ఇది మా నూతన చర్య .. సరిహద్దులో ఉగ్రవాదం పెట్రేగిపోతున్న తరుణంలో ఆయన ధీటుగా స్పందించారు.