ఎన్సీబీ అధికారిని జైలుకు పంపిస్తానన్న మంత్రి నవాబ్ మాలిక్: సమీర్ వాంఖడే కౌంటర్
ముంబై: నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆయన సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సమీర్ వాంఖడే ఓ తోలుబొమ్మ మాత్రమేనని, ఆయన్ను కొందరు ఆడిస్తున్నారన్నారు. ఎవరు ఒత్తిడి చేస్తున్నారో సమీర్ చెప్పాలన్నారు.
అంతేగాక, ఏడాదిలోగా సమీర్ వాంఖడే ఉద్యోగం పోవడం ఖాయమని, ఆయన్ను జైలుకు పంపేవరకూ తాను వదిలిపెట్టనని నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. బాలువుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సమీర్ వాంఖడే ప్రత్యేక అధికారిగా వచ్చారని, ఆ కేసును వదిలేసి సినీ పరిశ్రమపై పడ్డారని మండిపడ్డారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కూడా తప్పుడు కేసులో ఇరికించారని నవాబ్ మాలిక ఆరోపించారు.

క్రూజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నదంతా అబద్ధమని, వాట్సాప్ చాట్ ఆధారంగానే అరెస్టులు చేస్తున్నారని నవాబ్ మాలక్ వ్యాఖ్యానించారు. సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించినా.. ఇప్పటి వరకు అది ఆత్మహత్యో, హత్యో తేల్చలేదని అన్నారు. ఆ తర్వాత సినీపరిశ్రమను ఎన్సీబీ టార్గెట్ చేసిందని ఆరోపించారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమ మాల్దీవుల్లో ఉందని, అప్పుడు సమీర్ వాంఖడే, ఆయన కుటుంబా మాల్దీవుల్లో, దుబాయిలో ఏంచేస్తోందని ప్రశ్నించారు. సమీర్ వాట్సాప్ చాట్స్‌ను పరిశీలిస్తే ఎన్సీబీ కేసులు ఎంత బోగసో తెలుస్తాయ్నారు
Recommended Video
నవాబ్ మాలిక చేసిన ఆరోపణలను సమీర్ వాంఖడే ఖండించారు. మంత్రి చేసే ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదన్నారు. ప్రభుత్వ అనుమతితోనే తాను తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లినట్లు చెప్పారు. డిసెంబర్‌లో తాను దుబాయిలో ఉన్నానని మంత్రి చెప్పడం అవాస్తవమని, ఆ సమయంలో తాను ముంబైలోనే ఉన్నట్లు వాంఖడే స్పష్టం చేశారు. దాన్ని ఆయన దోపిడీ అనడం సరికాదన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగిననీ.. కానీ, నవాబ్ బాలిక్ ఒక మంత్రి అని అన్నారు. దేశానికి సేవ చేస్తున్నందుకు, డ్రగ్స్ నిరోధానికి నిజాయితీగా పనిచేస్తున్ననందున తనను జైలులో పెట్టాలనుకుంటే పెట్టాలని అన్నారు. తన కుటుంబంపైనా దాడి జరిగిందని, చట్టపరంగా తాము దీనిపై చర్యలు తీసుకుంటామని సమీర్ వాంఖడే వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications