ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నా.. హర్ హర్ మహదేవ్ సినిమా వివాదంతో ఎన్సీపీనేత సంచలన నిర్ణయం
మరాఠీ చిత్రమైన హర్ హర్ మహాదేవ్ సినిమా ప్రదర్శనను బలవంతంగా నిలిపివేసేందుకు, సినిమా చూడడానికి వచ్చిన వారిపై దాడి చేసినందుకు శరద్ పవార్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే జితేంద్ర అవద్ పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చత్రపతి శివాజీ చరిత్రని వక్రీకరించారని హర్ హర్ మహదేవ్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న ఆయన సినిమా పై ఆరోపణలు గుప్పించారు. దాంతో పాటు సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులపై దాడులు చేశారని, ఆయనను అరెస్టు చేసి కొనసాగుతున్న రగడ నేపథ్యంలో తాజాగా నేడు ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజీనామా చేస్తానన్న తాజా ఎమ్మెల్యే జితేంద్ర అవద్
రాజీనామా చేస్తానని ప్రకటించిన తాజా ఎమ్మెల్యే జితేంద్ర అవద్ తనపై గత 24 గంటల్లో తనపై రెండు తప్పుడు కేసులు పెట్టారని, అది కూడా ఐపీసీ 354 సెక్షన్ కింద తనపై కేసులు నమోదు చేశారని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన తనపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వెల్లడించారు. ఈ విషయంలో తాను పోరాటం చేస్తానని, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని నేడు ఉదయం ఆయన ట్వీట్ చేశారు.

హర్ హర్ మహాదేవ్ సినిమా నిలిపివేత వివాదం.. ఎన్సీపీ నేత అరెస్ట్, బెయిల్
ఎన్సిపి ఎమ్మెల్యే జితేంద్ర అవద్ హర్ హర్ మహాదేవ్ సినిమా ప్రదర్శన అవుతున్న వివియాన మాల్ లో ఈ చిత్రం మరాఠా చరిత్రను వక్రీకరించినదని, ఇటువంటి సినిమాలను రాష్ట్రంలో విడుదల చేయడం అనుమతించేది లేదని, సినిమా ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో థానే పోలీసులు అవద్‌తో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్ పై జైలుకు పంపించగా థానే సెషన్స్ కోర్టు థానే సెషన్స్ కోర్టు శనివారం వరకు బెయిలిచ్చి విడుదల చేసింది. ఇక షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు, అవద్ సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని, ఆయనకు నోటీసులు వచ్చినప్పుడల్లా వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని పేర్కొంది.

ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ఇక మహారాష్ట్రకు చెందిన ఎన్సిపి నేత జితేంద్ర అవద్ హర్ హర్ మహాదేవ్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏదైనా సమస్య ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయాలని, కానీ ఈ విధంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇక ఆ సినిమా తాను చూడలేదని పేర్కొన్న దేవేంద్ర ఫడ్నవీస్, ఆ వివాదం గురించి తెలియదన్నారు. ఇక ఘటనకు భాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications