ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. వైరల్ వీడియో

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుపాను చెలరేగింది. ఎన్‌సీపీ కీలక నేత, ఎఫ్‌డీఏ మంత్రి నరహరి జిర్వాల్‌కు సంబంధించిన ఒక వివాదాస్పద వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో కలిసి పడకగదిలో ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో ఇబ్బందుల్లో ఉన్న జిర్వాల్‌కు, ఈ తాజా పరిణామం రాజకీయంగా పెను సవాలుగా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో జిర్వాల్, ఆయన పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ అధికారిక గృహంలో ఏకాంతంగా గడుపుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై స్పందించిన రవి యాదవ్ అనే వ్యక్తి, సదరు ట్రాన్స్‌జెండర్ అనేకమంది ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ఆరోపించారు.

NCP Leader Narhari Zirwal Video Controversy Minister Faces Blackmail Allegations and Resignation Demands

ఎమ్మెల్సీ పదవి కోసమో లేదా ట్రాన్స్‌జెండర్ బోర్డులో కీలక బాధ్యతల కోసం ఆమె ఇలాంటి వీడియోలతో నాయకులను బెదిరిస్తోందని ఆయన ఒక టీవీ ఛానెల్‌తో పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో వెలుగులోకి రాగానే కాంగ్రెస్ పార్టీ, సామాజిక కార్యకర్త అంజలి దమానియా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహిస్తూ జిర్వాల్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

పార్టీలో అంతర్గత పోరు.. కుట్ర కోణం!

మరోవైపు, ఎన్‌సీపీ నేత అమోల్ మిట్కరీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది జిర్వాల్‌పై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆయన అభివర్ణించారు. "ఎనిమిది నెలల క్రితం నాటి పాత వీడియోను అసెంబ్లీ సమావేశాల ముగిసిన వెంటనే ఎందుకు విడుదల చేశారు? జ్యోతిష్యుడు అశోక్ ఖరత్ కేసులోని సిట్ దర్యాప్తు నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ డ్రామా ఆడుతున్నారు" అని మిట్కరీ మండిపడ్డారు.

అజిత్ పవార్ మరణానంతరం ఆయన భార్య సునేత్రా పవార్ అధ్యక్షురాలు కావాలని మొదటగా ప్రతిపాదించిన వ్యక్తి జిర్వాల్ అని, అందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుని వరుస వివాదాల్లోకి నెడుతున్నారని మిట్కరీ వాదించారు.

మహిళా నేతలపై కూడా వేటు గండం?

ఈ వివాదం కేవలం జిర్వాల్‌తోనే ఆగలేదు. ఎన్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపాలి చకన్కర్‌పై కూడా పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అశోక్ ఖరత్ కేసులో ఆమె పేరు వినిపించడంతో, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని నాసిక్, అహల్యానగర్ విభాగాలకు చెందిన మహిళా నేతలు సునేత్రా పవార్‌కు లేఖలు రాశారు. రూపాలి చకన్కర్‌ను తక్షణమే పదవి నుండి తొలగించాలని వారు కోరుతున్నారు.

సునేత్రా పవార్‌కు అగ్నిపరీక్ష..

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఎన్‌సీపీ పగ్గాలు చేపట్టిన సునేత్రా పవార్‌కు ఈ వ్యవహారం పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు జిర్వాల్‌పై వస్తున్న నైతిక మరియు అవినీతి ఆరోపణలు, మరోవైపు పార్టీ మహిళా విభాగంలో అసమ్మతి.. వీటిని ఆమె ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సక్పాల్ ఈ ప్రభుత్వాన్ని ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో పోలుస్తూ తీవ్ర విమర్శలు గుప్పించడంతో, అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+