లోక్‌సభ రద్దు- ముందస్తుకు ముహూర్తం ఖరార్..?!
ముంబై: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది. ఇప్పటికే త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, కర్ణాటకల్లో వేర్వేరు విడతల్లో ఈ ప్రక్రియ ముగిసింది.
ఈ అయిదింటిపైనా కన్నేసింది భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో అధికారంలోకి రావడం, తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితిని గద్దె దించేలా వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల బీజేపీ కార్యవర్గంలో కీలక మార్పులు చేసింది.

అదే సమయంలో- మహారాష్ట్ర అసెంబ్లీకి సైతం ముందస్తు ఎన్నికలను నిర్వహించాలనే యోచనలో ఉంది బీజేపీ. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం చేరికతో ఇక తమకు తిరుగే ఉండబోదని భావిస్తోంది బీజేపీ. ఈ ధీమాతోనే ఇదే డిసెంబర్‌లో ఈ అయిదు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాలనే ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది.
వీటితో పాటు- లోక్‌సభకు కూడా ముందస్తు ఎన్నికలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్‌సభను రద్దు చేసి, ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లాలనే ప్రతిపాదనలపై బీజేపీ కసరత్తు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలాగూ నిర్వహించాల్సి ఉంది. మహారాష్ట్రను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య ఆరుకు చేరుతుంది.
ఈ ఆరింటితో పాటు లోక్‌సభకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందనే దిశగా బీజేపీ అధిష్ఠానం అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందంటూ ఇటీవలే టైమ్స్ నౌ సర్వే సైతం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ పట్టును ఇలాగే కొనసాగించడానికి ముందస్తుకు వెళ్తేనే మేలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదే విషయాన్ని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ మనవడు, ఆ పార్టీ శాసన సభ్యుడు రోహిత్ పవార్ స్పష్టం చేశారు కూడా. ఈ ఏడాది డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన బాంబు పేల్చారు. దీనికి అవసరమైన చర్యలను కేంద్రం ఇప్పటికే తీసుకుందని కూడా వెల్లడించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మరమ్మతు, కొత్త మిషన్ల కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్డర్లను జారీ చేసిందని వివరించారు. నమ్మకస్తులైన కొంతమంది అధికారుల ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని రోహిత్ పవార్ పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘెరంగా ఓడిపోవడం, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామనే విశ్వాసం లేకపోవడం కూడా బీజేపీ లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లేడానికి ఓ కారణంగా విశ్లేషించారు రోహిత్ పవార్.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications