మమత దీదీ.. కాచుకో: బెంగాల్ పై గురి పెట్టిన కేంద్రం
జనతాదళ్ (యునైటెడ్) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. మరో విడత బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది వరుసగా అయిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రికార్డును బ్రేక్ చేయనున్నారు. ఈ నెల 15 లేదా 18వ తేదీన నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ప్రభంజనం సృష్టించింది ఎప్పట్లాగే. మొత్తం 75 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జేడీయూకు క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే వార్తలు వెలువడినప్పటికీ.. ఈ ఫలితాలను బట్టి చూస్తోంటే..అవన్నీ కూడా పటాపంచలయ్యాయి. రికార్డు స్థాయిలో భారీ మెజారిటీని సాధిస్తోన్నారు జేడీయూ అభ్యర్థులు.

ఈ తిరుగులేని విజయంపై బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి గిరిరాజ్ కిశోర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ఎన్డీఏ అందిస్తోన్న సుపరిపాలనకు అద్దం పట్టిందని, ప్రజల విశ్వాసానికి దక్కిన ఘనతేనని అభివర్ణించారు. బీహార్‌ను అర్థం చేసుకున్న వారికి ఇక్కడి ప్రజలు 'జంగల్ రాజ్'ని కోరుకోవడం లేదని తెలుసునని వ్యాఖ్యానించారు. అరాచకాన్ని, అవినీతి నాయకత్వాన్ని బీహార్ పౌరులు తిరస్కరించారని అన్నారు. బీహార్‌లోని ఎన్నికల తీర్పు అభివృద్ధి, సుపరిపాలనకే తప్ప అస్థిరత్వానికి కాదని ఆయన స్పష్టం చేశారు.
బీహార్ కు చెందిన ఓ సామాన్య బీజేపీ కార్యకర్తగా స్పష్టంగా చెబుతున్నానని, బీహార్ తర్వాత ఇక పశ్చిమ బెంగాల్ వంతు వస్తుందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోనూ గెలుస్తామని గిరిరాజ్ కిశోర్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలో అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టికరిపిస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో అరాచకం, ఆటవిక పాలన నడుస్తోందని, అందుకే తమకు అనుకూలంగా తీర్పు ఇస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న గందరగోళంపై అడిగిన ప్రశ్నకు గిరిరాజ్ సింగ్ స్పష్టమైన సమాధానమిచ్చారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన ధృవీకరించారు. నితీష్ కుమార్ తమ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారని, ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎటువంటి గందరగోళం అవసరం లేదని అన్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఇందులో గందరగోళానికి తావు లేదని పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications