Bihar polls: బీహార్లో తేలిన ఎన్డీయే లెక్క-బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ వాటాలివే..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. బీహార్ లో అత్యధిక సీట్లలో పోటీ చేసేందుకు ఎన్డీయే కూటమి పార్టీలైన బీజేపీ, జేడీయూ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయితే పొత్తు చర్చల్లో ఇరు పార్టీలు వెనక్కి తగ్గకపోవడంతో చివరికి తలో 101 సీట్లలో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. కూటమిలో మరో కీలక పార్టీ అయిన చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జన్ శక్తికి 29 సీట్లు ఇచ్చేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీ, జేడీయూ ఇద్దరూ సమానంగా తలో 101 సీట్లలో పోటీ చేయనుండగా.. మరో 29 సీట్లు ఎల్జేపీకి దక్కాయి. మిగిలిన సీట్లలో ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చాకు తలో ఆరు సీట్లు కేటాయించారు. ఈ విషయాన్ని బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

हम एनडीए के साथियों ने सौहार्दपूर्ण वातावरण में सीटों का वितरण पूर्ण किया।
— Dharmendra Pradhan (@dpradhanbjp) October 12, 2025
BJP – 101
JDU – 101
LJP (R) – 29
RLM – 06
HAM – 06
एनडीए के सभी दलों के कार्यकर्ता और नेता इसका हर्षपूर्वक स्वागत करते हैं।
बिहार है तैयार,
फिर से एनडीए सरकार।#NDA4Bihar ✌️
బీహార్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు అధికార ఎన్డీయే కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భారీగా పథకాలను కూడా ప్రకటిస్తోంది. రాష్ట్రంలో మహిళల ఓట్లతో పాటు ఇతర వర్గాలను కూడా దగ్గర చేసుకునేందుకు వీలుగా సీఎం నితీశ్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విపక్ష ఇండియా కూటమి నుంచి వీరికి గట్టి పోటీ లభిస్తోంది. సీఎంగా విపక్ష నేత తేజశ్వీ యాదవ్ గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే అభ్యర్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications