CoWIN:3గంటల్లోనే 80లక్షల మంది -వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌కు పోటెత్తిన జనం -మీరూ చేసుకోండిలా

స్వైరవిహారం చేస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియకు దేశం శ్రీకారం చుట్టింది. 18 నుంచి 45ఏళ్లలోపు వారికి మే1 నుంచి టీకాలు అందజేసే కార్యక్రమానికి సంబంధిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం(ఏప్రిల్‌ 28) సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన CoWIN పోర్టల్ ద్వారా రిజిస్ట్రేసన్లు కొనసాగుతున్నాయి. అయితే..

పోటెత్తిన అప్లికేషన్లు..

పోటెత్తిన అప్లికేషన్లు..

కొవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు మొదలైన కొద్ది క్షణాలకే పెద్ద ఎత్తున జనం ఒక్కసారిగా కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించంతో వెబ్‌సైట్‌ కొద్దిసేపు క్రాష్‌ అయ్యింది. కొవిన్ సర్వర్‌ సమస్యలు తలెత్తడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. కొద్ది మందికి మాత్రం ఎలాంటి సమస్యలు లేకుండానే రిజిస్ట్రేషన్ పూర్తయింది. అయితే ప్రస్తుతం కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ కు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని వెల్లడైంది. కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం కొవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన తొలి మూడు గంటల్లోనే ఏకంగా 80 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

 45లోపు వాళ్లకి మాత్రమే..

45లోపు వాళ్లకి మాత్రమే..

ఆధార్, ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా జరుగుతోన్న ప్రక్రియలో 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే స్లాట్‌ బుక్‌ అవుతోంది. కొవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్య సేతు, ఉమాంగ్‌ యాప్‌లలో తప్పనిసరిగా ముందస్తు నమోదు చేసుకోవాలని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళితే టీకాలు ఇవ్వరు. ఫలానా సెంటర్లో అపాయింట్‌మెంట్‌ ఉంటేనే వ్యాక్సిన్లు పొందేవీలుంటుంది.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఇలా..

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఇలా..

కొవిన్‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలివి.. 1)మొదట కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ చేసి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. 2)ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే 'రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్' పేజ్‌ ఓపెన్ అవుతోంది. 3)దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. 4)ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి. 5)పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే..దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+