రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు.. నీట్ జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) మరియు జేఈఈ మెయిన్ 2020 పరీక్ష నిర్వహణపై దుమారం చెలరేగుతోంది. పరీక్ష తేదీ దగ్గర పడుతుండటంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది. సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూలు ఖరారు కాగా జేఈఈ మెయిన్ సెప్టెంబర్ 1 మరియు సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జేఈఈ మెయిన్‌కు 9.53 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... నీట్ పరీక్షకు 15.97 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

కరోనావైరస్ కారణంగా పరీక్ష నిర్వహణను ఆలస్యం చేసి ఒక విద్యాసంవత్సరంను విద్యార్థులు నష్టపోకూడదని కేంద్రం చెబుతుండగా...వేలాది విద్యార్థులు, ఆయా రాష్ట్రప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పరీక్ష నిర్వహణను కరోనా సమయంలో వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమయంలో పరీక్ష నిర్వహిస్తే ఇటు విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పార్టీలు, విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. నీట్‌ జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

NEET and JEE news live updates:Congress to protest while academicians support test and writes to Modi

Sep 04, 2020, 2:59 pm IST

నీట్ జేఈఈ పరీక్ష: సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన ఆరు రాష్ట్రాలకు చుక్కెదురు. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం.
Sep 04, 2020, 1:44 pm IST

75శాతం మంది విద్యార్థులు జేఈఈ పరీక్ష రాసేందుకు వెళ్లలేదు. కేంద్రం మొండి వైఖరి వీడాలన్న మమతా బెనర్జీ
Sep 04, 2020, 1:41 pm IST

రివ్యూ పిటిషన్‌ వేసిన ఆరు రాష్ట్రాలు
Sep 04, 2020, 1:41 pm IST

నీట్ పరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ విచారణ
Sep 03, 2020, 10:17 am IST

ఒడిషా

పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసిన ఒడిషా సర్కార్. పలు హోటళ్లు రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
Sep 02, 2020, 3:53 pm IST

కేరళ

కేరళలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేసిన అధికారులు
Sep 02, 2020, 3:51 pm IST

సుప్రీంకోర్టులో నీట్ పరీక్ష నిర్వహణపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు
Sep 02, 2020, 3:51 pm IST

పరీక్షా కేంద్రంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారన్న ఢిల్లీ విద్యార్థి
Sep 01, 2020, 6:16 pm IST

పరీక్షా కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు
Sep 01, 2020, 6:16 pm IST

సెప్టెంబర్ 1 నుంచి 6వరకు జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలు
Sep 01, 2020, 6:16 pm IST

జేఈఈ మెయిన్‌కు సంబంధించి కౌన్సిలింగ్ ప్రారంభం కాగానే ఎన్‌ఐటీ వరంగల్ కటాఫ్ మార్కులను విడుదల చేస్తుంది
Sep 01, 2020, 9:36 am IST

జమ్మూ కాశ్మీర్

జమ్మూలోని కాలుచక్ ప్రాంతంలో గల చీనాబ్ కాలేజ్ ఆప్ ఎడ్యుకేషన్‌లో ఏర్పాటు చేసిన జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రానికి చేరుకుంటోన్న అభ్యర్థులు. పరీక్షలను నిర్వహించడం పట్ల సంతోషంగా ఉందని ఓ అభ్యర్థి వ్యాఖ్యానించారు.
Sep 01, 2020, 9:18 am IST

బిహార్

బిహార్ రాజధాని పాట్నాలోని పాటలీపుత్ర కాలనీలో గల టీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రం బారులు తీరిన అభ్యర్థులు. పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సరైన రవాణా వసతులు అందుబాటులో లేవని వారు వాపోతున్నారు.
Sep 01, 2020, 8:57 am IST

కర్ణాటక

బెంగళూరులోని ఎస్‌జేఎం ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఏర్పాటు చేసిన జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రానికి చేరుకుంటోన్న అభ్యర్థులు. వారి టెంపరేచర్‌ను పరీక్షించిన తరువాతే లోనికి అనుమతి ఇస్తోన్న సిబ్బంది.
Sep 01, 2020, 8:32 am IST

న్యూఢిల్లీ

జేఈఈ మెయిన్స్ పరీక్షలను రాయడానికి న్యూఢిల్లీ వివేక్ విహార్‌లో గల అర్వాచిన్ భారతీ భవన్ సీనియర్ సెకెండరీ స్కూల్ పరీక్షా కేంద్రానికి చేరుకుంటోన్న అభ్యర్థులు.
Sep 01, 2020, 8:19 am IST

పశ్చిమ బెంగాల్

దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు కాస్సేపట్లో ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. వారికి థర్మల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు సిబ్బంది. కోల్‌కతలోని టీసీఎస్ గీతోబిటన్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల సందడి
Sep 01, 2020, 2:26 am IST

మరికొన్ని గంటల్లో జేఈఈ పరీక్ష.. ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు
Aug 31, 2020, 2:55 pm IST

జేఈఈ నీట్ పరీక్షలు రాసే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు ఉచితంగా చేర్చేందుకు బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Aug 31, 2020, 1:17 pm IST

ఉత్తర్ ప్రదేశ్

జేఈఈ నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ లక్నోలో ఆందోళన చేపట్టిన సమాజ్‌ వాదీ పార్టీ స్టూడెంట్ వింగ్ నాయకులను చెదరగొడుతున్న పోలీసులు
Aug 31, 2020, 1:15 pm IST

పరీక్ష కేంద్రంలోకి హ్యాండ్ బ్యాగ్స్, స్టేషనరీ, చేతిగడియారాలు నిషేధం
Aug 31, 2020, 1:14 pm IST

రేపటి నుంచి జేఈఈ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జార్ఖండ్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్‌ ఏర్పాటు చేస్తున్న సిబ్బంది
Aug 31, 2020, 1:14 pm IST

రేపు జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు
Aug 30, 2020, 11:53 pm IST

ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్‌లో పరీక్షలపై చర్చలు పెడతారని జేఈఈ, నీట్ అభ్యర్థులు ఆశించగా.. ఆయన బొమ్మలపై మాట్లాడారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Aug 30, 2020, 8:30 pm IST

జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను తెలుపుతున్నారు.
Aug 30, 2020, 12:10 pm IST

విద్యార్థులంతా పరీక్షపై దృష్టి సారించండి. కోర్టులు ఇచ్చే తీర్పులపై , నిరసనలపై దృష్టి పెట్టొద్దు: విద్యావేత్తలు
Aug 30, 2020, 9:24 am IST

ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్షలు రాసే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు చేరేందుకు సహకరించనున్న ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్థులు
Aug 29, 2020, 10:59 pm IST

నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అమలుచేస్తామని అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అయితే కరోనా వైరస్ రూపంలో ఇప్పటికీ ప్రమాదం పొంచే ఉందని అన్నారు.
Aug 29, 2020, 10:04 pm IST

నీట్,జేఈఈ పరీక్షల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఏడు నగరాల్లో లాక్ డౌన్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఏకె త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
Aug 29, 2020, 7:50 pm IST

నీట్ జేఈఈ పరీక్షల నిర్వహణకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ నిరసనలు
Aug 29, 2020, 5:40 pm IST

నీట్ ఎగ్జామ్స్‌కు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ నేత ఆరోగ్యం క్షీణించడంతో కిమ్స్‌కు తరలింపు
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+