అమ్మాయి బ్రా తొలగించమన్న ఇష్యూ: టీచర్లపై వేటు
నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థుల బ్రాలను తొలగించమన్న ఉపాధ్యాయులపై వేటు పడింది. నలుగురు ప్రయివేటు స్కూల్ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించారు.
తిరువనంతపురం: నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థుల బ్రాలను తొలగించమన్న ఉపాధ్యాయులపై వేటు పడింది. నలుగురు ప్రయివేటు స్కూల్ ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించారు.
నీట్ పరీక్షకు వచ్చిన విద్యార్థులను బ్రా తొలగించాలని వారు అడిగారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు చేశారు. కేరళ మానవ హక్కుల కమిషన్, చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. దీంతో నలుగురు టీచర్లను సస్పెండ్ చేశారు.
కాగా, ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు హాజరైన విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు అధికారుల డ్రెస్‌కోడ్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే.

కేరళలోని కన్నూరులో పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంతో పరీక్ష రాసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తొలగించి వస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చేసేది లేక దానిని తొలగించి బయట ఉన్న తల్లి చేతిలో పెట్టి పరీక్షకు హాజరైంది.
పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చిన కుమార్తె, తన చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి మళ్లీ వేగంగా లోపలికి వెళ్లిపోయిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
పరీక్ష పూర్తయిన అనంతరం విద్యార్థిని ఈ విషయాన్ని మీడియాకు చెప్పింది. నీట్‌లో డ్రెస్‌కోడ్ విధించడంతో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications