NEET: 'ఘోర పాపం'పై కేంద్రం కీలక నిర్ణయం- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనా..!
ఈ ఏడాది లక్షల మంది విద్యార్దులకు శాపంగా మారిన నీట్ పరీక్ష (NEET UG 2026) లీకుల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా కోసం ఢిల్లీలో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్రంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా నీట్ పరీక్షలో లీకులపై పార్లమెంట్ లో చర్చించేందుకు సైతం కేంద్రం (Centre) అంగీకరించకపోవడంపై ముప్పేట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం విపక్షాల డిమాండ్ కు ఎట్టకేలకు అంగీకారం తెలిపింది.
గతంలో నీట్ పరీక్షలో లీకులు చోటు చేసుకున్న సమయంలోనే విపక్ష నేత రాహుల్ గాంధీ దీనిపై పార్లమెంట్ లో చర్చించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్దులు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ అదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. పార్లమెంట్ లో నీట్ పై సమగ్ర చర్చకు సిద్దంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విపక్షాలకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు నీట్ లీకులకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న విపక్షాలు, విద్యార్దుల డిమాండ్ ను మాత్రం కేంద్రం తోసిపుచ్చింది. ఈ డిమాండ్ రాజకీయ ప్రేరేప్రితమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు నీట్ పేపర్ లీక్ జరిగినట్లు తెలిసిన వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యతగా రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నీట్ లీకులపై సీబీఐ విచారణకు ఆదేశించడం, పరీక్ష రద్దు, తిరిగి నిర్వహించడం కూడా అందులో భాగమని కేంద్రం వాదిస్తోంది. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం కానీ, ప్రధాని మోడీ కానీ సిద్దంగా లేరన్న విషయం అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications