వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్ 2022 ఫలితాలు విడుదల: రాజస్థాన్ విద్యార్థికి 1వ ర్యాంక్, తెలంగాణ విద్యార్థికి 5

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ ఫలితాలను విడుదల చేసింది. కాగా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన తనిష్క మొదటి ర్యాంక్ సాధించారు.

ఢిల్లీకి చెందిన వత్స ఆశీష్ బాత్రాకు రెండో ర్యాంక్ వచ్చింది. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు ఐదో ర్యాంక్ సాధించాడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది అర్హత సాధించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.

 NEET UG Results 2022 Released: Telangana student get 5th Rank, 1st rank for Rajasthan student

జులై 17న దేశ వ్యాప్తంగా 497 నగరాల్లో 3570 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది అత్యధికంగా 18.72 లక్షల మందికిపై అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

టాప్-10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు వీరే

1. తనిష్క- రాజస్థాన్
2. వత్స ఆశీష్ బాత్రా- ఢిల్లీ
3. హృషికేశ్ నాగభూషణ్ గంగూలే- కర్ణాటక
4. రిచా పవాశి- కర్ణాటక
5. ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు- తెలంగాణ
6. రిషి వినయ్ బాల్సే - మహారాష్ట్ర
7. అర్పిత నారంగ్ -పంజాబ్
8. కృష్ణ ఎస్ఆర్- కర్ణాటక
9. జీల్ విపుల్ వ్యాస్ -గుజరాత్
10. హాజిక్ పర్వీజ్ లోన్-జమ్మూకాశ్మీర్

NEET UG Results 2022 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

English summary
NEET UG Results 2022 Released: Telangana student get 5th Rank, 1st rank for Rajasthan student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X