భారీ ఆర్థిక సాయం, మోడీకి నేపాల్ ప్రశంసల వర్షం
ఢిల్లీ: భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. సంక్షోభ సమయంలో ఆదుకున్నందుకు మోడీని నేపాల్ ప్రశంసల్లో ముంచెత్తింది. భూకంపంతో దెబ్బ తిన్న నేపాల్‌ను కాళ్ళ మీద నిలబడడానికి భారత్ చేసిన సాయం అద్భుతమంటూ నేపాల్ పేర్కొంది.
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా భారత్ తోడ్పాటును కొనియాడారు. నేపాల్‌లో భూకంపం సంభవించినపుడు అందరికంటే ముందే భారత్ స్పందించిన విషయం తెలిసిందే. మన బలగాలు ఎంతో చేశాయి.

నేపాల్‌కు రెస్క్యూ టీములు, వైద్య సిబ్బంది, విపత్తు నిర్వహణా నిపుణులను భారత్ పంపింది. భారత వైమానిక దళం, ఆర్మీ కూడా హెలిక్యాప్టర్‌లు, రవాణా విమానాలను సహాయ కార్యక్రమాల నిమిత్తం నేపాల్‌కు పంపించాయి.
తాజాగా, నేపాల్‌కు భారత్ భారీ సాయాన్ని ప్రకటించింది. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దానిని ప్రకటించారు. భూకంపంతో తీవ్ర నష్టానికి గురైన నేపాల్‌కు భారత్ ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. దీంతో నేపాల్ ప్రధానిని ప్రశంసించింది.












Click it and Unblock the Notifications