నేపాల్: 128గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన మహిళ
ఖాట్మాండ్: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపధాటికి శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఓ మహిళ 128 గంటలపాటు పోరాడి ప్రాణాలతో బయటపడింది. గత శనివారం నేపాల్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన పెను భూకంపంలో 25 ఏళ్ల కృష్ణదేవీ ఖడ్క అనే మహిళ ఓ భవనం శిథిలాల కింద ఇరుక్కుపోయింది.
ఎన్డీఆర్ ఎఫ్, నేపాల్ ఆర్మీ దళాలు సంయుక్తంగా సహాయక చర్యలను నిర్వహించి కృష్ణదేవీని సురక్షితంగా కాపాడాయి. ఐదు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో నేపాల్‌లోని గోంగబు గ్రామంలో ఓ గెస్ట్‌హౌస్ భవనం కుప్పుకూలడంతో శిథిలాల కింద ఇరుక్కుపోయింది. ట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్, నేపాల్ ఆర్మీ దళాల సాయంతో కృష్ణదేవీ మృత్యుంజయురాలిగా బయటపడింది.
మరో ఇద్దరిని కాపాడిన సహాయక బృందాలు

భూకంప శిథిలాల కింద నుంచి మరో ఇద్దరిని సైన్యం సురక్షితంగా రక్షించింది. ఇందులో ఒకరు యువకుడు కాగా, మరొకరు పదేళ్ల లోపు బాలుడు. వీరిద్దరికీ వైద్య చికిత్స అందజేస్తున్నారు. వారు భూకంపం షాక్‌నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
భూకంప ధాటికి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. 15 వేలకు పైగానే చనిపోయి ఉంటారని అంచనావేస్తున్నారు. ఆర్మీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కొండచరియలు విరిగి పడి ధ్వంసమైన రోడ్లకు మరమ్మతుల చేస్తున్నారు.
భూకంప కేంద్ర పరిసర గ్రామాలకు సైతం సహాయం అందిస్తున్నారు. వాహనాల్లో ఆహార పదార్థాలు తీసుకు వెళ్లి అందజేస్తున్నారు. ప్రపంచ దేశాల సాయం నేపాల్‌కు అందుతోంది. ఎయిర్‌బస్‌లలో ఆహార పదార్థాలు, మెడిసిన్‌లను జర్మనీ దేశం నేపాల్‌కు పంపింది. రాజధాని ఖాట్మాండ్‌లో శిథిలాల తొలగింపు వేగవంతమైంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications