ఢిల్లీ వీధుల్లో విరాళాలు సేకరిస్తోన్న నేపాల్ విద్యార్ధులు, ఒడిషా ప్రభుత్వం 5 కోట్ల సాయం

న్యూఢిల్లీ: భూకంపంతో అతలాకుతమైన నేపాల్‌కు సహాయం అందించేందుకు గాను ఢిల్లీలో చదువుకుంటున్న నేపాల్ విద్యార్ధులు విరాళాలు సేకరిస్తున్నారు. గత శనివారం నేపాల్‌లో రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 6,000 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

నేపాల్‌లో సంభవించిన భూకంపం దాదాపు 80 లక్షలకుపైగా జనాభాపై ప్రభావం చూపించింది. నేపాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు దేశ రాజధాని ఢిల్లీలో చదువుకుంటున్నారు. నేపాల్ భూకంప విలయాన్ని చూసిన వారంతా, తమ దేశానికి ఎంతో కొంత సహాయం అందేంచేందుకు గాను కాలేజీ క్లాసులు అయిపోగానే ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు.

Nepalese students in Delhi raise funds for quake-hit country

ఢిల్లీలో సీఏ కోర్సు చదువుతున్న 20 ఏళ్ల ప్రజ్వల్ అనే నేపాలీ విద్యార్ధి మాట్లాడుతూ విరాళాలు సేకరించిన సొమ్ముతో సహాయ సామాగ్రిని కొనుగోలు చేసి ఒకసారి తమ దేశానికి పంపించామని, ఇంకా విరాళాలు సేకరిస్తున్నామని చెప్పాడు.

నేపాల్‌కు ఒడిషా ప్రభుత్వం రూ. 5 కోట్ల సాయం

భూకంపం దెబ్బకు అతలాకుతలమైన నేపాల్‌కి ఒడిషా ప్రభుత్వం రూ.5 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ నేపాల్ ప్రజలు భూకంపం స్ధితి నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+