స్కిన్ షో!: వాంఖేడేకు ప్రీతి ఇలా ఇబ్బందికరంగా(ఫోటో)

ముంబై: రెండు రోజుల క్రితం (మంగళవారం) ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతిజింతా వాంఖేడే స్టేడియంలో నెస్ వాడియా వేధింపుల విషయమై విచారణ అధికారులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు వాంఖేడేకు వచ్చిన ప్రీతి సింపుల్ డ్రెస్‌లో వచ్చింది. చెక్స్ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి వచ్చింది. కాగా, తనను నెస్ వాడియా మూడుసార్లు వేధించాడని ప్రీతిజింతా చెప్పారని సమాచారం.

కాగా, బాలీవుడ్ నటి, ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా స్టేట్‌మెంట్‌ను మంగళవారం విచారణ అధికారులు తీసుకున్నారు. తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను ఎక్కడైతే వేధించాడని ప్రీతిజింతా చెబుతున్నారో.. అక్కడే (వాంఖేడే స్టేడియం) పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను తీసుకున్నారు. వాంఖేడే స్టేడియంలో ప్రీతిజింతా తనకు నెస్ వాడియా నుండి ఎదురైన పరాభవం పూసగుచ్చినట్లుగా చెప్పారని సమాచారం.

Ness Wadia abused me three times, says Preity

ప్రీతి 12 నుండి 14 మంది సాక్ష్యులను పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. విచారణాధికారులు వారి స్టేట్‌మెంట్ కూడా త్వరలో తీసుకోనున్నారు. తనను నెస్ వాడియా వేధించిన మూడు ప్రదేశాలను ఆమె చూపించారు. తనను వేధించినప్పుడు నెస్ స్నేహితులు కూడా కొందరు ఆయన వెంట ఉన్నట్లు చెప్పారని సమాచారం. ఓ జట్టు సభ్యుడి బంధువు (ఆస్ట్రేలియా వ్యక్తి) నెస్ వాడియాను వారించారని చెప్పారు.

తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రీతిజింతా చెప్పిందని పోలీసులు తెలిపారు. సాక్ష్యుల పేర్లు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. అనంతరం విచారణకు సహకరించాలని నెస్ వాడియా తరఫు న్యాయవాదికి పోలీసులు సూచించారు. కాగా, స్టేట్‌మెంట్ రికార్డ్ కోసం ప్రీతిజింతా తన న్యాయవాదితో కలిసి ఆరు గంటల నలభై నిమిషాలకు వాంఖేడే స్టేడియానికి వచ్చారు. ఇందుకోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆమె స్టేట్‌మెంట్‌ను మరైన్ డ్రైవ్ పోలీసులు రికార్డ్ చేశారు. గంటన్నర పాటు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+