మాటమార్చిన మణిశంకర్: మోడీని అలా అనలేదని..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మాటమార్చారు. తాను ఎప్పుడూ నరేంద్ర మోడీని చాయ్‌వాలా అని అనలేదని మణిశంకర్ అయ్యర్ చెప్పుకొస్తున్నారు. నరేంద్ర మోడీని చాయ్‌వాలా అంటూ చులకనగా మాట్లాడిన అయ్యర్ పరోక్షంగా భారతీయ జనతా పార్టీ విజయానికి కొంతమేర దోహపడ్డారనే చెప్పాలి.
ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తాను అసలు మోడీని ఆ మాటే(చాయ్‌వాలా అని) అనలేదని మణిశంకర్ అయ్యర్ అన్నారు. అంతేగాక ఎన్నికల ప్రచారంలో బిజెపి నేత మోడీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను మణిశంకర్ సమర్థించారు.

ఎన్నికల ప్రచారంలో మోడీ నీచ రాజకీయాలు చేస్తున్నారని ప్రియాంక గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలను మోడీకి ఎన్నికల ప్రచారంలో బాగానే ఉపయోగపడ్డాయి. తక్కువ కులం కాబట్టే ప్రియాంక అలాంటి వ్యాఖ్యలు చేశారని మోడీ ఎదురుదాడికి దిగారు. ఆమె వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో అనుకూలంగా వాడుకోవడంలో మోడీ విజయం సాధించారు.
ఎన్నికల ముందు మణిశంకర్ అయ్యర్ ఓ వార్త ఛానల్‌తో మాట్లాడుతూ... మోడీని చాయ్‌వాలా అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోతే చాయ్ కొట్టు పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. అయ్యర్ చేసిన వ్యాఖ్యలు బిజెపి ఎన్నికల ప్రచారానికి బాగానే ఉపయోగించుకుంది. చాయ్‌వాలాపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది. కాగా, ఇటీవలి ఎన్నికల్లో తమిళనాడులోని మైలదుతురై నుంచి పోటీ చేసిన మణిశంకర్ అయ్యర్ ఓటమి పాలయ్యారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications