500 Notes: శ్రీరాముని బొమ్మతో కొత్త రూ.500 నోట్లు.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!
Fact Check: ప్రస్తుతం దేశంలో ఏమూలన విన్నా శ్రీరాముని నామమే. ఆయన గురించిన విశేషాలను ప్రజలు తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి కొత్తగా రాముని బొమ్మ ముద్రించిన రూ.500 నోట్లు వస్తున్నాయనే వార్త వైరల్ అయ్యింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22 జనవరి 2024న శ్రీరాముని చిత్రంతో కొత్త రూ.500 నోటును విడుదల చేయబోతోందనే వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర మహోత్సవం జరుగుతుండగా అయోధ్యలో రామమందిరం, శ్రీరాముడి చిత్రపటం ఉన్న రూ.500 నోటు ఇదేనంటూ కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నిజంగానే మోదీ సర్కార్ ఈ ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానం దేశంలోని ప్రజల్లో నెలకొంది.

వైరల్ అవుతున్న ఫోటోలో మహాత్మా గాంధీకి బదులు శ్రీరాముడు ఫోటో ఉంది. రామమందిర శంకుస్థాపనకు ముందే కొత్త కరెన్సీ నోట్లలో మహాత్మాగాంధీ చిత్రపటాన్ని తొలగించి దాని స్థానంలో రాముడి చిత్రపటాన్ని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అయితే శ్రీరాముడి చిత్రంతో కొత్త 500 రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. శ్రీరాముడి ఫోటోతో వైరల్ అవుతున్న రూ.500 నోటు నకిలీదిగా ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.
అయితే జాతిపిత మహాత్మా గాంధీ స్థానంలో మరికొన్ని చిత్రాలతో కొత్త రూ.500 నోట్లను విడుదల చేయడం ఇదే తొలిసారి కాదు. జూన్ 2022లో RBI ప్రస్తుత కరెన్సీ, బ్యాంకు నోట్లలో మహాత్మా గాంధీ చిత్రపటాన్ని భర్తీ చేయాలని, రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి APJ కలాం చిత్రాలతో కొత్త నోట్లను ముద్రించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు ప్రచారం అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిణామాలపై రిజర్వు బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications