Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవంబర్ నుంచి డిగ్రీ, పీజీ క్లాసులు - తాజా అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - వాళ్లకు అడ్మిషన్ ఫీజు వాపస్

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఆరు నెలలుగా నిలిచిపోయిన ఉన్నతవిద్యకు సంబంధించి కేంద్ర విద్యా శాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. వివిధ యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరానికిగానూ సవరించిన అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతితో తాజా క్యాలెండర్ ను ఖరారు చేశామని విద్యా శాఖ తెలిపింది.

సవరించిన అకాడెమిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి సంవత్సరం డిగ్రీ, పీజీ విద్యార్థులకు నవంబర్ నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి. నవంబర్ 30 తర్వాత ఎలాంటి అడ్మిషన్లను అనుమతించరు. లాక్ డౌన్ వల్ల కోల్పోయిన సమయాన్ని కవర్ చేసేందుకుగానూ విద్యా సంస్థల పనిదినాలను పెంచారు. తద్వారా వారానికి ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. సెలవుల్ని కూడా కుదిస్తారు.

 New academic calendar for UG, PG 1st year, full refund on admission cancellation

కరోనా లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా విద్యార్థులు ఎవరైనా అడ్మిషన్లు రద్దు చేసుకుంటే వాళ్లకు అడ్మిషన్ ఫీజును నూరుశాతం తిరిగి చెల్లిస్తామని విద్యా శాఖ తెలిపింది. లాక్ డౌన్ లో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు అడ్మిషన్ ఫీజు రీఫండ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా నవంబర్ నుంచి క్లాసుల ప్రారంభం, నవంబర్ 30తో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిఅవుతుందన్నారు.

మరోవైపు, అఖిల భారత సాంకేతికత విద్యామండలి(ఏఐసీటీఈ) కూడా ఇటీవలే సవరించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త విద్యా సంవత్సరం(2020-21)లో బీటెక్, బీఫార్మసీ ఫస్టియర్‌ తరగతులను నవంబరు 1వ తేదీ లోపు ప్రారంభించాలని ఏఐసీటీఈ సవరించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను జారీ చేసింది.

Recommended Video

    PM Modi On NEP 2020 ఇంగ్లీష్‌తో పాటు విదేశీ బాషలకూ ప్రోత్సాహం.. హోలిస్టిక్ షీట్ ! || Oneindia

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+