సిలిండర్ల బుకింగ్ పై కేంద్రం తాజా నిర్ణయం
మధ్యప్రాచ్యం ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలోని ప్రతి కుటుంబానికి ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా నిరాటంకంగా ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నూతన నిబంధనలను విడుదల చేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్దేశించిన తాజా నియమావళి ప్రకారం- నెలకు గరిష్టంగా రెండు ఎల్‌పీజీ సిలిండర్లను మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ పరిమితిని దాటి బుక్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ బుకింగ్ వ్యవస్థ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. లేదా కొత్తగా కేవైసీని ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నెల 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద 12 సిలిండర్లను అందజేస్తుంది. ఈ కోటా పూర్తయిన తర్వాత కూడా గ్యాస్ అవసరాల కోసం వినియోగదారులు మరో మూడు వరకు మాత్రమే సబ్సిడీ రహిత సిలిండర్లను కొనుగోలు చేయవచ్చు. అంటే- సంవత్సరానికి ఒక కనెక్షన్‌పై గరిష్టంగా 15 సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.

వార్షికంగా కేటాయించిన 12 సిలిండర్ల కోటా పూర్తయ్యాక కూడా అదనపు సిలిండర్లు అవసరమైతే- బీపీసీఎల్ ఒక ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని కోసం 'హలో బీపీసీఎల్' మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి వినియోగదారులు కొన్ని ముఖ్యమైన వివరాలను అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు- ఇంట్లో వివాహం వంటి కుటుంబ వేడుకలు లేదా ఇతర ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయా లేదా, అంచనా వేసిన అతిథుల సంఖ్య ఎంత వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
వినియోగదారులు అందించిన ఈ సమాచారం ఆధారంగానే అదనపు సిలిండర్ల కోసం వారి అర్హత నిర్ణయిస్తారు. అదనపు సిలిండర్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ధారిస్తారు. అవసరం అనుకుంటేనే అదనపు సిలిండర్ మంజూరు అవుతుంది. డబుల్ సిలిండర్ కనెక్షన్ ఉంటే ఒక్కో బుకింగ్‌ల మధ్య వ్యవధి 35 రోజుల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు ఇది 25 రోజుల వరకు మాత్రమే పరిమితమై ఉండేది. కొరత కారణంగా అదనంగా మరో 10 రోజులు జోడించింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఒక్కో బుకింగ్‌ల మధ్య ఇకపై గడువు 45 రోజులు తప్పనిసరి. సింగిల్ సిలిండర్ కనెక్షన్ బుకింగ్‌ల విషయంలోనూ సవరింపులు చోటు చేసుకున్నాయి. బుకింగ్ మధ్య వ్యవధి 25 రోజులు తప్పనిసరి అయింది. సిలిండర్ డెలివరీ సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ - DAC) వస్తుంది. ఈ కోడ్‌ను డెలివరీ బాయ్‌కి తెలియజేసిన తర్వాతే సిలిండర్ అందజేస్తారు.
బుకింగ్‌లు కేవలం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారానే సాధ్యం. నంబర్ మారితే, దాన్ని ఏజెన్సీలో లేదా యాప్ ద్వారా వెంటనే అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వం అన్ని దేశీయ గ్యాస్ వినియోగదారులకు ఈ-కేవైసిని తప్పనిసరి చేసింది. కేవైసి అప్‌డేట్ చేయని వారికి సబ్సిడీ నిలిపివేస్తారు. సిలిండర్ బుకింగ్‌లలో సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను పొందడానికి e-KYC ప్రక్రియను పూర్తి చేయడం అత్యవసరం.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications