ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఎంత డిపాజిట్ చేస్తే అంత టాక్ టైమ్..

ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసే మొత్తానికి.. అంతే సమానంగా వినియోగదారుడికి టాక్ టైమ్ అందించనున్నట్టుగా ఎయిర్ టెల్ యాజమాన్యం ప్రకటించింది.

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. పేటీఎం తరహాలో రిలయన్స్, ఎయిర్ టెల్ కూడా ఆ దిశగా తమ సేవలను మరింతగా విస్తరించాలనే యోచనలో ఉన్నాయి.ఇందులో భాగంగానే తాజాగా ఎయిర్ టెల్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

New Bharti Airtel offer: 1 minute talk time for every rupee deposited in Payments Bank account

ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసే మొత్తానికి.. అంతే సమానంగా వినియోగదారుడికి టాక్ టైమ్ అందించనున్నట్టుగా ఎయిర్ టెల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ లెక్కన ఒక్క రూపాయి డిపాజిట్ చేస్తే.. ఒక్క నిమిషం టాక్ టైమ్, రూ.వెయ్యి పొదుపు చేస్తే వెయ్యి నిమిషాల టాక్ టైమ్ వినియోగదారుడి ఖాతాలో చేరుతాయి.ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు ఎండీ, సీఈవో శశి అరోరా ఈ విషయాన్ని ప్రకటించారు.

షరతులు వర్తిస్తాయి:

ఎయిర్‌టెల్ ఆఫర్ అయితే ఇచ్చింది కానీ కొన్ని పరిమితులు కూడా విధించింది. ఎయిర్ టెల్ అందించే టాక్ టైమ్ దేశీయ కాల్స్ కు మాత్రమే వర్తిస్తాయి. అలాగే మొదటిసారి డిపాజిట్ చేసే మొత్తానికే మాత్రమే టాక్ టైమ్ నిబంధన వర్తిస్తుంది. రాజస్థాన్‌లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ 7.25శాతం వడ్డీని చెల్లిస్తోంది. దీంతోపాటు లక్ష రూపాయలను వ్యక్తిగత ప్రమాద భీమా కల్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+