ప్రధానమంత్రి పంట బీమా పథకం ప్రత్యేకతలివే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్తగా ప్రవేశపెట్టిన పంట బీమా పథకం రైతలు జీవితాల్లో భారీ మార్పు తీసుకువస్తుందని ప్రధాని నరేంద్రమోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ప్రిమయైన రైతు సోదర, సోదరీమణులారా! అంటూ ప్రధానమంత్రి పంట బీమా పథకం గురించి తెలియజేస్తూ లెటర్ ద్వారా ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈ లెటర్‌లో ప్రధాని మోడీ పంట బీమా పథకం గురించి వివరించే ప్రయత్నం చేశారు. అతివృష్టి, అనావృష్టి, ఆకాల వర్షాలు, కరవులతో మన దేశంలోని రైతులు తల్లడిల్లుతున్నారన్నారు. అలాంటి రైతుల కోసం గడచిన 18 నెలలుగా అనేక విధానాలను తీసుకుంటూనే ఉన్నామన్నారు.
గతంలో రైతుల కోసం అనేక పంటల బీమా పథకాలున్నాయని గుర్తు చేసిన ప్రధాని, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీమా పథకం రైతాంగానికి ఊరటనిస్తుందన్నారు. మోడీ అధ్యక్షతన జరిగిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది.

ఈ పథకం కింద ఖరీఫ్ ఆహార ధాన్యాలు లేదా నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే.. రబీ ఆహారధాన్యాలు లేదా నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు కేవలం 1.5 శాతం చెల్లిస్తే చాలు. ప్రీమియంలో మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ముఖ్యాంశాలు:
* ఒక పంటల బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఇన్సూరెన్స్ చెల్లించే పథకం ఇదే.
* ఈ పథకంలో రైతులు అతి తక్కువ ప్రీమియాన్ని చెల్లిస్తారు.
* ప్రభుత్వ రాయితీపై గరిష్ట పరిమితి లేదు. ప్రీమియం 90 శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వమే అంతా భరిస్తుంది.
* ఆహార ధాన్యాలు లేదా నూనెగింజలకు ప్రతి సీజన్‌కు ఒకే ప్రీమియాన్ని నిర్ణయించింది. ఈ ప్రీమియం ఖరీఫ్‌కు 2 శాతం నిర్ణయించగా, రబీకి 1.5 శాతంగా నిర్ణయించారు.
* పొలంలో ఉన్న పంటకు జరిగిన నష్టంతో పాటు విత్తులు లేదా నాట్లు వేయలేకపోవటం, పంట కోత తర్వాత జరిగే నష్టాలకూ బీమా వర్తిస్తుంది.
* పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.
* వరద ముంపు వంటి విపత్తులకు వర్తిస్తుంది.
* అంతేకాదు క్లెయిమ్ సెటిల్ కోసం పంట నష్టాన్ని అంచనా వేయటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతారు.
* స్మార్ట్ ఫోన్ల ద్వారా పంట కోత సమాచారాన్ని ఫొటోలు తీసి, అప్‌లోడ్ చేస్తారు. పంట కోతలతో పరిశీలనలను తగ్గించేందుకు రిమోట్ సెన్సింగ్‌ను వినియోగిస్తారు.
* బ్యాంకు రుణాలు తీసుకున్న వారు పంట బీమా ప్రస్తుతం తప్పనిసరి.
* వచ్చే మూడేళ్లలో మొత్తం పంటల విస్తీర్ణంలో బీమా కవరేజీని 50 శాతానికి పెంచనున్నారు.
* ఇందుకు గాను ఏడాదికి రూ. 17,600 కోట్లు వ్యయమవుతుంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.
* తొలి ఏడాది 2016-17 లో మొత్తం పంట విస్తీర్ణంలో 30 శాతానికి బీమా వర్తింపచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రూ. 5,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
* రాష్ట్రం మొత్తానికి ఒక బీమా కంపెనీ ఉంటుంది. విపత్తులతో జరిగే నష్టానికి, కోతల తర్వాత జరిగే నష్టానికి పొలం స్థాయిలో అంచనా వేస్తారు.
* భారత వ్యవసాయ బీమా సంస్థతో పాటు ప్రైవేట్ బీమా కంపెనీలూ ఈ పథకాన్ని అమలు చేస్తాయి.
A letter to my hardworking farmer brothers and sisters, on the Pradhan Mantri Fasal Bima Yojana. pic.twitter.com/PdUQg5tBbO
— Narendra Modi (@narendramodi) January 16, 2016 











Click it and Unblock the Notifications