కరోనా వచ్చిందా ? అయితే పదేళ్ల వరకూ ఢోకా లేనట్లే- వ్యాక్సిన్ తీసుకున్న వారికీ..
కరోనాతో పోరాడుతున్న రోగులకు రోగనిరోధక శక్తి పెంచేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన రోజులకు రోగనిరోధక శక్తి పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా వెలువడిన రెండు అధ్యయనాలు కరోనా రోగుల్లో్, అలాగే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కొత్త ఆశలు చిగురింపజేసేలా ఉన్నాయి. కరోనా సోకినా, వ్యాక్సిన్ వేయించుకున్నా దీర్ఘకాలం పాటు రోగనిరోదకత ఉంటుందని ఆయా అధ్యయనాలు చెప్తున్నాయి.

కరోనా తర్వాత రోగనిరోధకత
కరోనా సోకిన తర్వాత చికిత్స తీసుకున్న రోగులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని ఇప్పటివరకూ డాక్టర్లు చెప్తున్నారు. కరోనా సోకడం వల్ల రోగి శరీరంగా రోగనిరోధక కణాలు బలహీనపడతాయని, లేదా చచ్చిపోతాయని భావిస్తున్నారు. దీంతో ఓసారి కరోనా వచ్చిపోయిన తర్వాత తిరిగి ఎప్పుడైనా మళ్లీ కరోనా లేదా ఇతర వైరస్‌ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కరోనా ఫస్ట్‌వేవ్‌లో వైరస్ బారిన పడిన కొందరు సెకండ్ వేవ్‌లో మరోసారి వైరస్ బాధితులుగా మారడమే.

కరోనా బాధితులకు ఊరట
కరోనా సోకిన తర్వాత మళ్లీ కరోనా సోకే ప్రమాదం ఉంటుందని, లేదా ఇతర వైరస్‌లు సోకవచ్చనే భయాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా వెలువడిన రెండు అధ్యయనాలు బాధితులకు భారీ ఊరటనిచ్చేలా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సార్స్-2 వైరస్ సోకిన వారికి లేదా దీనికి వ్యతిరేకంగా టీకాలు తీసుకున్న వారికి దీర్ఘకాలం పాటు వైరస్ సోకకుండా రోగనిరోధకత అభివృద్ఘి చెందుతుందని ఈ అధ్యయనాలు స్ఫష్టం చేస్తున్నాయి. ఈ అధ్యయనాల ఫలితాలు ప్రస్తుతం డాక్టర్లు, రోగుల్లో నెలకొన్న భయాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో వీటిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
Recommended Video

అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే
ఈ రెండు అధ్యయనాల్లోనూ శాస్తవేత్తలు సార్స్-2 వైరస్ లేదా కోవిడ్ వైరస్ ఓసారి సోకిన తర్వాత కనీసం ఏడాది పాటైనా తిరిగి వైరస్ సోకే అవకాశం లేకుండా రోగనిరోధకత ఉంటుందని చెప్తున్నారు. గరిష్టంగా పదేళ్ల పాటు కరోనా ఓసారి వచ్చిపోయిన లేదా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రోగి బోన్‌మ్యారోలో రోగనిరోధక శక్తి పెంపొందించే కణాలు ఉత్పత్తి అవుతాయని, అవి కచ్చితంగా సార్స్ వైరస్‌పై పోరాడే శక్తి కలిగి ఉంటాయని అవి వివరించాయి. బోన్‌మ్యారో ద్వారా రోగనిరోధక కణాల ఉత్పత్తి అనేది ఈ రెండు అధ్యయనాల్లో తేలిన ప్రధానాంశం. అయితే ఇవి వ్యాక్సినేషన్ వేయించున్న నారితో పోలిస్తే కరోనా చికిత్స తీసుకున్న వారిలోనే ఎక్కువ ఉత్పత్తి అవుతాయని, ఓసారి కోలుకున్నాక అవి క్రమంగా తగ్గిపోతాయని తేలింది.












Click it and Unblock the Notifications